- Home
- Entertainment
- Singer Sunitha: సునీత అందంపై నెటిజన్ కామెంట్.. భార్య లైన్‌లోకి రావడంతో అడ్డంగా బుక్కై చివరికి..వైరల్
Singer Sunitha: సునీత అందంపై నెటిజన్ కామెంట్.. భార్య లైన్‌లోకి రావడంతో అడ్డంగా బుక్కై చివరికి..వైరల్
సింగర్ సునీత ఏజ్ పెరిగే కొద్ది అందం పెరుగుతుంది. ఆమె లేటెస్ట్ గా ఓ క్యూట్ ఫోటోని పంచుకుంది. ఆ ఫోటో కారణంగా ఓ నెటిజన్ తన భార్య వద్ద బుక్కైపోయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

అద్భుతమైన గాత్రంతో తెలుగు ఆడియెన్స్‌ని మంత్రముగ్దుల్ని చేస్తుంది సింగర్ సునీత(Sunitha). సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. మరోవైపు `పాడుతా తీయగా` వంటి పాటల ప్రోగ్రామ్‌కి జడ్జ్ గా చేస్తుంది. నిత్యం బిజీగా ఉంటుంది. కెరీర్ పరంగా దూసుకుపోతుంది. మరోవైపు అప్పుడప్పుడు తన ఫామ్ హౌజ్‌లో ఫామింగ్ పనులు చేస్తూ రిలాక్స్ అవుతుంది.
డిజిటల్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నాక సింగర్ సునీత జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఆమె రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతుంది. ఓ వైపు వ్యక్తిగత జీవితాన్ని, మరోవైపు కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అన్ని విషయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సునీతకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది.
అయితే తాజాగా ఆమె పంచుకున్న ఓ ఫోటో ఓ నెటిజన్ల ఇంట్లో చిచ్చు పెట్టింది. సునీత ఇటీవల ఓ ఫ్రెష్ అండ్ క్యూట్ ఫోటోని పంచుకుంది. ఇందులో ఎంతో అందంగా ఉంది సునీత. చాలా మంది నెటిజన్లు ఈ ఫోటోకి కామెంట్ పెట్టారు. సునీత చాలా అందంగా ఉందంటూ పోస్ట్ లు పెట్టారు. అలాగే రజనీబాబు అనే నెటిజన్ మీ లుక్ చాలా బాగుంది అని పోస్ట్ పెట్టాడు. ఇలాంటి కామెంట్ పెట్టడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ దీనికి ఆయన భార్య రియాక్ట్ అవ్వడమే ఇప్పుడు దుమారం రేపుతుంది.
సునీత ఫోటోకి సదరు నెటిజన్ పెట్టిన కామెంట్ కింద ఓ లేడీ నెటిజన్ రియాక్ట్ అయ్యింది. `ఓ అవునా` అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసుకుంది. అయితే ఆ పోస్ట్ పెట్టింది ఎవరని ఆరా తీస్తే ఆ నెటిజన్ భార్యనే అని తేలింది. దీంతో ఇది పెద్ద రచ్చగా మారింది. సునీతకి కామెంట్ చేసి భార్య వద్ద అడ్డంగా బుక్కైపోయాడీ నెటిజన్.
మరోవైపు దీన్ని ఫన్నీగా మీమ్స్ చేసి ఆడుకుంటున్నారు నెటిజన్లు. `ఏంటన్నా ఇలా బుక్ అయిపోయావ్..`, `ఇప్పుడు రజినీబాబు పరిస్థితి ఏంటో..`, `మాస్టారూ బతికే ఉన్నారా?..` మీపై మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయండీ బాబూ.. నువ్ తగ్గొద్దు అన్నా మీ వెనుక మేం ఉన్నాం..`, `ఈ రోజు ఇంట్లో ఏమైందో రేపు కామెంట్స్‌లో చెప్పన్నా` అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది తట్టుకోలేక రజనీబాబు తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లాక్ చేసి, తన పోస్ట్ ని డిలీట్ చేశాడు. మరి ఇంట్లో అతగాడి పరిస్థితి పరిస్థితేంటో....