MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చావు ఇళ్లకు నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు.. ఆ నమ్మకం, భయాలు ఉన్నాయా ?

చావు ఇళ్లకు నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు.. ఆ నమ్మకం, భయాలు ఉన్నాయా ?

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు సినీ ప్రముఖుల్ని కలవర పెడుతున్నాయి. కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నిన్న సీనియర్ నటుడు చలపతిరావు తక్కువ వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 26 2022, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో జరుగుతున్న వరుస మరణాలు సినీ ప్రముఖుల్ని కలవర పెడుతున్నాయి. కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, నిన్న సీనియర్ నటుడు చలపతిరావు తక్కువ వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వయసు ప్రభావం వల్లే వీరంతా మరణించారు. కానీ టాలీవుడ్ లో తరుచుగా విషాద వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వీరంతా మరణించినప్పుడు సినీ ప్రముఖులంతా వెళ్లి పార్థివ దేహాలకు నివాళులు అర్పించడం చూశాం. కానీ కింగ్ నాగార్జున మాత్రం ఇటీవల ఏ సెలెబ్రటీ మరణించినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన సందర్భాలు లేవు. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, పవన్, అల్లు అరవింద్ , సురేష్ బాబు ఇలా టాలీవుడ్ బడా సెలెబ్రిటీలు అంతా వెళుతున్నారు. 

36

పోస్ట్ పోన్ చేయలేని షెడ్యూల్ ఉంటే మాత్రం ఒకరిద్దరు మిస్ అవుతున్నారు. చలపతిరావు మరణించినప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఫారెన్ టూర్ లో ఉన్నారు. కానీ చలపతిరావు మరణవార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేశారు. చలపతిరావు ని కడసారి చూశారు. 

46

కానీ నాగార్జున నుంచి ఇలాంటివి ఏవి ఉండడం లేదు. ఒకటి రెండు సార్లు అయితే బిజీగా ఉన్నారని అనుకోవచ్చు. ఇటీవల కాలంలో నాగార్జున ఏ చావు ఇంటికి వెళ్లడం లేదు. ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం విషాదాలు జరిగిన ఇంటికి వెళుతున్నారు. అయితే నాగార్జున ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దానిపై కొత్త చర్చ మొదలైంది. 

 

56

కొందరికి చావు ఇళ్లకు వెళ్ళకూడదు అనే నియమం ఉంటుంది. అలాగే ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కూడా జ్యోతిష్యులు, స్వామీజీలు చెడు జరిగిన ఇళ్లకు వెళ్ళకూడదు అని సూచిస్తారు. దీనితో నాగార్జున జ్యోతిష్యుల సలహా ఏమైనా పాటిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

 

66

ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. బాలయ్యకి జ్యోతిష్యాలు, పూజలు, రాసులపై నమ్మకం ఎక్కువ అని అంటుంటారు. కానీ బాలయ్య మాత్రం విషాదాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి నాగార్జున విషయంలో ఏం జరుగుతోందో స్వయంగా కింగే క్లారిటీ ఇవ్వాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved