MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Thriller Movies: జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన టాప్ 5 మలయాళం థ్రిల్లర్స్..ఉక్కిరి బిక్కిరి చేసే ట్విస్టులు

Thriller Movies: జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన టాప్ 5 మలయాళం థ్రిల్లర్స్..ఉక్కిరి బిక్కిరి చేసే ట్విస్టులు

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారి కోసం జియోహాట్‌స్టార్‌ లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ మూవీస్ ఇవి. ‘నేరు’, ‘సూక్ష్మదర్శిని’, ‘అబ్రహం ఓజ్లర్’, ‘21 అవర్స్’, ‘హెవెన్’ సినిమాల ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 29 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Crime Thriller Movies
Image Credit : Asianet News

OTT Crime Thriller Movies

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడూ మంచి ఆప్షన్. హత్యలు, రహస్యాలు, ఇన్వెస్టిగేషన్, ఊహించని ట్విస్టులతో సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఉత్కంఠ రేపుతాయి. అలాంటి కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు జియో-హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేంటో చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Neru
Image Credit : our own

Neru

మోహన్‌లాల్ నటించిన 'నేరు' (2023) ఒక సాలిడ్ కోర్ట్-రూమ్ క్రైమ్ డ్రామా. కంటిచూపు లేని ఒక యువతిపై అత్యాచారం జరుగుతుంది. తనపై దాడి చేసిన వ్యక్తిని గుర్తించడానికి ఆమె ఒక శిల్పాన్ని తయారు చేస్తుంది. ఇదే కేసులో కీలక సాక్ష్యంగా మారుతుంది. నిందితుడు పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు కావడంతో కేసు కోర్టుకు వెళ్తుంది. బాధితురాలి తరఫున మోహన్‌లాల్, నిందితుడి తరఫున ప్రియమణి వాదిస్తారు. కోర్టులో విచారణ, నెమ్మదిగా నిజం బయటకు రావడం సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. క్లైమాక్స్‌లో నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఈ సినిమా జియో-హాట్‌స్టార్‌లో ఉంది, తమిళంలో కూడా చూడొచ్చు.
36
Sookshmadarshini
Image Credit : our own

Sookshmadarshini

2024లో వచ్చిన 'సూక్ష్మదర్శిని' రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలకు భిన్నంగా ఉంటుంది. హీరోయిన్ తన పక్కింటికి కొత్తగా వచ్చిన వ్యక్తి వింత ప్రవర్తనను గమనిస్తుంది. అతనిపై అనుమానంతో, తనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. మొదట్లో ప్రేక్షకులకు కూడా ఏదో జరుగుతోందని అనిపించినా, ఆ తర్వాత కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను కొనసాగించడమే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా జియో-హాట్‌స్టార్‌లో ఉంది, తమిళంలో కూడా చూడొచ్చు.
46
Abraham Ozler
Image Credit : instagram

Abraham Ozler

జయరామ్ నటించిన 'అబ్రహం ఓజ్లర్' (2024) ఒక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్. ఆసుపత్రిలో చేరిన ఒక వ్యక్తి అనుమానాస్పద మరణంతో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఒకే పద్ధతిలో వరుస హత్యలు జరుగుతుండటం పోలీసులకు షాక్ ఇస్తుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ఆఫీసర్ అబ్రహం ఓజ్లర్, హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్, ట్విస్టులు, జయరామ్ నటన సినిమాకు హైలైట్. ముఖ్యంగా జయరామ్, మమ్ముట్టి కలిసి వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా జియో-హాట్‌స్టార్‌లో ఉంది, తమిళ డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది.
56
21 Hours
Image Credit : X

21 Hours

2022లో వచ్చిన '21 అవర్స్' ఒక మిస్టీరియస్ మర్డర్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్సు అనుకోకుండా హత్యకు గురవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసే హీరో, దీని వెనుక మరికొన్ని అనుమానాస్పద మరణాలు ఉన్నాయని గుర్తిస్తాడు. ఈ వరుస ఘటనల వెనుక ఎవరున్నారు, హంతకుడి ఉద్దేశం ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తుంది. మొదట్లో నెమ్మదిగా అనిపించినా, ఆ తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. ఈ సినిమా జియో-హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
66
Heaven
Image Credit : X

Heaven

2022లో విడుదలైన 'హెవెన్' ఒక ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అడవికి ట్రిప్‌కి వెళ్లిన కొంతమంది విద్యార్థులు అనుకోకుండా రెండు శవాలను కనుగొంటారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అదే సమయంలో, మరోచోట ఒక కుటుంబం హత్య, ఒక కిడ్నాప్ కేసు కూడా పోలీసుల దృష్టికి వస్తాయి. వేర్వేరుగా కనిపించే ఈ కేసుల మధ్య ఉన్న సంబంధమే సినిమాలోని పెద్ద ట్విస్ట్. హీరో ఇన్వెస్టిగేషన్ స్టైల్, సహజమైన నటన సినిమాకు ప్లస్ పాయింట్స్. కొన్నిచోట్ల లాజిక్ ప్రశ్నలు తలెత్తినా, మొత్తంగా ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ సినిమాను జియో-హాట్‌స్టార్‌లో చూడొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image2
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Recommended image3
Neethu Natraj: నటరాజ్ మాస్టర్ తో ప్రేమ,పెళ్లి.. తెలుగు అమ్మాయి కాదు కానీ.. నీతూ గురించి ఈ విషయాలు తెలుసా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved