MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎంత ధైర్యం మీకు చిరంజీవితో ఇలానా.. డైరెక్టర్ కి చేదు అనుభవం, దిమ్మతిరిగేలా బలంగా కొట్టి చూపించాడు

ఎంత ధైర్యం మీకు చిరంజీవితో ఇలానా.. డైరెక్టర్ కి చేదు అనుభవం, దిమ్మతిరిగేలా బలంగా కొట్టి చూపించాడు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తడబడుతున్న సమయంలో ఒక దశలో గ్యాప్ తీసుకున్నారు. ఎస్పీ పరుశురాం, మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్ లాంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకోక తప్పలేదు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2024, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తడబడుతున్న సమయంలో ఒక దశలో గ్యాప్ తీసుకున్నారు. ఎస్పీ పరుశురాం, మెకానిక్ అల్లుడు, బిగ్ బాస్ లాంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకోక తప్పలేదు. కొంత కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి హిట్లర్ చిత్రంలో నటించారు. ఇది మలయాళీ చిత్రానికి రీమేక్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చిత్రానికి కరెక్ట్ దర్శకుడు ఎవరని వెతుకుతున్న సమయంలో ముత్యాల సుబ్బయ్య కనిపించారు. ఆటైం ఆయన ఎక్కువగా సెంటిమెంట్ చిత్రాలు చేస్తున్నారు. పవిత్రబంధం, గోకులంలో సీత, హిట్లర్, అన్నయ్య లాంటి హిట్ చిత్రాలన్నీ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలోనే వచ్చాయి. 

36

హిట్లర్ సినిమాకి తానే డైరెక్టర్ అని తెలియగానే ముత్యాల సుబ్బయ్య ఎగిరి గంతేశారట. చిరంజీవిని డైరెక్టర్ చేయడమే తన అదృష్టంగా భావించినట్లు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. ఈ చిత్రంలో చాలా సవాళ్లు ఎదురైనట్లు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. 

46

చిరంజీవి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అలాంటి హీరోకి ఐదుగురు చెల్లెళ్ళు ఏంటి అని షూటింగ్ దశలోకి చాలా మంది విమర్శించారట. అది చాలదు అన్నట్లు రెండు తీవ్రమైన ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి. కన్నీళ్లు పెట్టించే పాటలు అవి. 

56

ఈ విషయం తీసుకున్న కొందరు ప్రముఖులు.. ఎంత ధైర్యం అయ్యా మీకు.. చిరంజీవిని హీరోగా పెట్టి అసలేం చేస్తున్నారు మీరు.. ఈ సినిమా ఆడుతుందా అంటూ భయపెట్టడం మొదలు పెట్టారట. కానీ ముత్యాల సుబ్బయ్య ఎలాంటి కంగారుకి గురి కాలేదు. 

66

ఎమోషనల్ సాంగ్స్ కి కనీసం కొరియోగ్రాఫర్ ని కూడా పెట్టుకోలేదట. పాటలు తాను అనుకుననట్లే రావాలని స్వయంగా ఆయనే చిత్రీకరించారట. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ మాత్రమే కాదు.. కామెడీ సీన్స్ కూడా అదరగోట్టాయి. తనని భయపెట్టిన వారే మూవీ రిలీజ్ అయ్యాక మెచ్చుకున్నట్లు ముత్యాల సుబ్బయ్య తెలిపారు. గ్యాంగ్ లీడర్ తర్వాత చిరంజీవి ధరించిన చొక్కాలకు మళ్ళీ హిట్లర్ చిత్రంతో మంచి క్రేజ్ వచ్చింది. హిట్లర్ సినిమాలో చిరంజీవి చొక్కాలు అంటూ విపరీతంగా అమ్ముడయ్యాయి అని ముత్యాల సుబ్బయ్య అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image3
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved