రేటు పెంచిన మృణాల్ ఠాకూర్, నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా...?
టాలీవుడ్ లో తన వేట మొదలెట్టింది మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతో స్టార్ గా మారిన ఈమె.. రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నాని జోడీగా నటించబోతున్న ఈ బ్యూటీ ఈసినిమాకు ఎంత వసూలు చేస్తుందంటే..?
సీతారామం సినిమా తరువాత మృణాల్ కు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోలు సైతం ఆమెపై కన్నేశారు. అయితే సీతారామం తరువాత ఆమెకు సినిమా ఫిక్స్ అవ్వడానికి కాస్త టైమ్ పట్టింది. దానికి కారణం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే. మృణాల్ ను బుక్ చేసుకోవడం కోసం వెళ్ళిన మేకర్స్ ఆమె డిమాండ్ చేసినరెమ్యూనరేషన్ విని వెనక్కి తగ్గారట.
ఇక చివరకు నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న సినిమాలో మృణాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారట ప్రొడ్యూసర్స్. నాని కూడా మృణాల్ అయితే బాగుంటుందని కాస్త గట్టిగానే చెప్పడంతో.. నిర్మాతలు ఒప్పుకున్నారట.
ఇక ఈసినిమా కోసం మృణాల్ అక్షరాలా 2 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. దానికి మేకర్స్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇలా రెండో సినిమాకే.. రెండు కోట్లు అందుకోబోతుంది మృణాల్. త్వరలోనే నాని 30 వ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. నాని జతగా మృణాల్ ఎలా ఉంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మరాఠి భామ...బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ జతగా సీతారామం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ గా తన పెర్ఫార్మన్స్, లుక్స్ తో ఆకట్టుకుంది.
సీతారామం సినిమాలో క్లాసిక్ లుక్ లో కనిపించిన మృణాల్ అటు యూత్ ను కూడా బాగా ఆకట్టుకుంది. ఈసినిమాతో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమె టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని టాక్ గట్టిగా నడిచింది. కాని ఆమె సెకండ్ సినిమాకు ఇంత టైమ్ పట్టింది.
టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు ఆమె తలుపుతడుతున్నాయి. అటు బాలీవుడ్ నుంచి కూడా స్టార్ హీరోలు మృణాల్ కావాలంటున్నారట. టాలీవుడ్ లో 2 కోట్లు అందుకుందంటే.. బాలీవుడ్ కు వెళ్ళి ఇంకా గట్టిగానే డిమాండ్ చేస్తుంది అని అంటున్నారు సినిమా పండితులు