Gaddar Awards: టాలీవుడ్‌ కి గుడ్‌ న్యూస్‌, ఏళ్లతరబడి నిరీక్షణకు తెర.. గద్దర్‌ అవార్డులకు ఆహ్వానం

టాలీవుడ్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ స్టేట్‌లో గద్దర అవార్డులను ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవార్డులకు ఆహ్వానించింది. 
 

cm revanth reddy fdc chairman dil raj announced gaddar awards invitation in telugu arj

టాలీవుడ్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా కళాకారుల ప్రతిభని గుర్తించి అందించే అవార్డులను త్వరలో ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిల్మ్ మేకర్స్ ని ఆహ్వానించింది. కొన్నేళ్లుగా అవార్డులకు కోసం సినీ కళాకారులు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు అవార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రతిభ ఉన్నకళాకారులకు ఆహ్వానిస్తుంది. 

నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు ఇవ్వబోతున్న తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 13 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు.

ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు కావచ్చు! కానీ, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని నిర్ణయించారు. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు.

గద్దర్‌ అవార్డులు ఇచ్చే విభాగాలు.. కొత్తగా ఏమున్నాయంటే?

2024వ సంవత్సరానికి నటీనటులు సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల సినిమాలకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు తొలి ఫీచర్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ విభాగాల్లోను పురస్కారాలు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

తెలుగు సినిమా పై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాసే ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా అవార్డులు ఇస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. దిల్‌ రాజు ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఆయన్ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గద్దర్‌ అవార్డులపై ఈ నిర్ణయం తీసుకున్నారు.

read  more: Nagarjuna: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే

also read: Balakrishna: బాలకృష్ణ చేయాల్సిన ఫస్ట్ 3డీ మూవీ ఏంటో తెలుసా? ఇంతటి భారీ సినిమా ఎలా ఆగిపోయింది?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios