గద్దర్ అవార్డులకు డేట్ ఫిక్స్, నంది అవార్డులకు దీనికి తేడా ఏంటంటే? వారికి డబ్బులు వెనక్కి
తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు సంబంధించి గద్దర్ అవార్డులను ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఇవ్వబోతున్నారో వెల్లడించారు ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు.

తెలుగు సినిమాలకుగానూ ఉమ్మడి రాష్ట్రంలో అందించిన నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త అవార్డులను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ప్రజా గాయకుడు స్మారకార్థం గద్దర్ పేరుతో ఈ అవార్డులు ఇవ్వబోతుంది. దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి.
తాజాగా గద్దర్ అవార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ ని ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఎఫ్‌డీసీ దీన్ని నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు సారథ్యంలో ఇది జరగనుంది.
ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల ప్రదానం..
ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులకు సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చింది. అవార్డులకు ఆహ్వానించింది ప్రభుత్వం. వివిధ విభాగాల్లో పోటీ పడే సినిమాలు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు అవార్డులను అందించేందుకు కూడా వేగంగా సన్నాహాలు చేస్తుంది.
ఏప్రిల్‌లోనే అవార్డుల ప్రదానం చేయబోతున్నట్టు ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గద్దర్ అవార్డుల కోసం ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసిందని చెప్పారు.
2014 నుంచి గద్దర్ అవార్డులు.. ఒక్కో ఏడాది ఒక్కో సినిమా
అందులో భాగంగా అవార్డులు ఎప్పట్నుంచి ఇస్తారనేది కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. 2013 తర్వాత అవార్డులు ఆగిపోయిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాది ఒక్కో చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు మాత్రం ఇవ్వనున్నారట. ఇక 2024లో విడుదలైన మూవీస్‌కి మాత్రం రెగ్యూలర్‌గా, అన్ని విభాగాల్లో అవార్డులు ఇవ్వబోతున్నారు. గద్దర్ అవార్డులకు సంబంధించిన నమూనా కూడా రెడీ అవుతుంది. ఏప్రిల్‌లో చాలా గ్రాండ్‌గా ఈ వేడుక నిర్వహిస్తామని తెలిపారు దిల్ రాజు.
నంది అవార్డులు, గద్దర్ అవార్డులకు ఉన్న తేడా..
ఇదిలా ఉంటే గతంలో ప్రభుత్వం సింహ పేరుతో అవార్డులు ఇవ్వాలనుకున్న విషయం తెలిసిందే. అందుకోసం చాలా మంది మేకర్స్ అప్లై చేసుకున్నారు. కొంత ఫీజు కూడా చెల్లించారు. ఆ అమౌంట్‌ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అవార్డులకు సంబంధించి వారం రోజుల్లో జ్యూరీ ఫైనల్ చేస్తుందన్నారు.
ఇక నంది అవార్డులకు, గద్దర్ అవార్డులకు ఉన్న తేడా ఏంటనేది దిల్ రాజు చెబుతూ, రెండూ సేమ్ అని, దానికి ఉన్న గైడ్‌లైన్సే దీనికి కూడా ఉంటాయని, కొన్ని చిన్న చిన్న మార్పులు చేశామని, త్వరలో ఆ వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక అవార్డులు
రెగ్యూలర్ విభాగాల అవార్డులతోపాటు పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వబోతున్నట్లు దిల్ రాజు తెలిపాడు. అలాగే తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలకు అవార్డులలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైఖ్యతా చిత్రం, బాలల చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
వీటితోపాటు ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ , షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందించనున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ దిల్ రాజు తెలిపారు.
read more: Bigg Boss Telugu 9 Host: విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే
also read: Bhanumathi Serial: స్టార్ మా కొత్త సీరియల్ `భానుమతి`లో ఏం చూపిస్తున్నారు? ఎందుకు చూడాలి?

