`సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగన్‌`లతో `దిల్‌రూబా`కి పోలికలు.. కిరణ్‌ అబ్బవరం వివరణ ఇదే

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ `దిల్‌ రూబా`. ఈ చిత్రం ఈ నెల14న విడుదల కానుంది. అయితే దీన్ని `సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగన్‌`లతో పోల్చుతున్న నేపథ్యంలో కిరణ్‌ క్లారిటీ ఇచ్చాడు. 
 

Kiran Abbavaram react on Sankranthiki vasthunnam and Dragon have similarities to dilruba in telugu arj

Kiran Abbavaram: `క` సినిమాతో హిట్‌ అందుకున్నాడు కుర్ర హీరో కిరణ్‌ అబ్బవరం. హీరోగా పుంజుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన మరో సినిమాతో రాబోతున్నారు. `దిల్‌రూబా` అంటూ ఈ నెల 14న ఆడియెన్స్ ని అలరించబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్‌ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు.

తన మూవీని `సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగన్‌` చిత్రాలతో పోల్చుతున్నారు. మాజీ లవర్‌ తిరిగి రావడమనేది ఈ మూవీస్‌ కాన్సెప్ట్. `దిల్‌ రూబా` కూడా సేమ్‌. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కిరణ్‌ అబ్బవరం. 

`సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగల్‌`లతో `దిల్‌రూబా`కి పోలిక అదొక్కటే

 మూడేళ్ల క్రితమే ఈ మూవీని స్టార్ట్ చేశామని, అప్పటికి ఇంకా  `డ్రాగన్`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలు కాలేదని తెలిపారు. కానీ `దిల్‌రూబా` కంటే ముందు ఆ మూవీస్ రిలీజ్ అయ్యాయని, ఆ చిత్రాలతో మా `దిల్ రూబా`కు ఎలాంటి పోలిక ఉండదు. కేవలం ఎక్స్ లవర్‌ తిరిగి రావడమే పోలిక అని, మిగిలినదంతా కొత్తగా ఉంటుందని వెల్లడించారు కిరణ్‌ అబ్బవరం.

ఈ సందర్భంగా డబ్బింగ్‌ సినిమాల గురించి చెబుతూ, `తమిళ, మలయాళ సినిమాలు కాస్త బాగున్నా ఇక్కడ ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మన ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. కానీ మన సినిమాలకు తమిళం, మలయాళంలో అంత స్కోప్ ఉండటం లేదు. మనం ఆదరించినట్లు వాళ్ల దగ్గర మన సినిమాల ఆదరణ పొందడం లేదు` అన్నారు కిరణ్‌ అబ్బవరం. 

మాజీ ప్రియురాలు వచ్చి కొత్త లవర్‌ని కలపడమే `దిల్ రూబా`..

సినిమా అసలు కథేంటో చెబుతూ, `దిల్ రూబా`లో ఏదో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దనే భావనతోనే సినిమా కథేంటో ముందే ప్రెస్ మీట్స్ లో రివీల్ చేశాం. ఇదొక న్యూ ఏజ్‌ లవ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. లవ్ లోని మ్యాజిక్ మూవ్ మెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. హీరో పాత్ర తీరుతెన్నులు బాగుంటాయి. 

`థ్యాంక్స్` ఎలా పడితే అలా చెప్పేస్తుంటాం. కానీ హీరోకు అలా చెప్పడం నచ్చదు. సారీ, థ్యాంక్స్ మాటలకు ఒక విలువ ఉందనేది అతని వెర్షన్. ఎక్స్ లవర్ ప్రెజెంట్ లవర్స్ ను కలపడం ఇందులో కొత్తగా ఉంటుంది.  హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పడు, అతని ఫ్యామిలీలో జరిగిన ప్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇప్పటిదాకా మన సినిమాల్లో ఎక్స్ లవర్ వల్ల గొడవలు జరగడం, కామెడీగా చూపించడం జరిగింది. కానీ `దిల్ రూబా`లో ఎక్స్ లవర్ తో కూడా ఒక స్నేహాన్ని షేర్ చేసుకోవచ్చు, మోరల్ సపోర్ట్ ఇవ్వొచ్చనే మంచి పాయింట్ ను మా మూవీలో చూస్తారు. 

`దిల్ రూబా`లో సిద్ధు క్యారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎమోషనల్ డ్రైవ్ లో మూవీ సాగుతుంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్స్ లా ఇందులో హీరో సిద్ధు నమ్మే సిద్దాంతం, అతను చెప్పే మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

మహిళలు గర్వంగా ఫీలయ్యే `దిల్‌రూబా`..

`దిల్ రూబా" సినిమా  ఫైనల్ గా చూసుకున్నామని, ఔట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, ఈ సినిమా మహిళలు గౌరవంగా ఫీలయ్యేలా ఉంటుందన్నారు కిరణ్‌. మిగతా వారితో పాటు ఫీమేల్ ఆడియెన్స్ `దిల్ రూబా`ను బాగా ఇష్టపడతారని, రెండున్నర గంటలు మూవీలో ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరని, థియేటర్స్ నుంచి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి మూవీ చూశామనే ఫీలింగ్‌తో వస్తారని చెప్పారు.

`క` కంటే ముందు చేసిన సినిమా అయినా  `క` రిజల్ట్ తర్వాత దాదాపు 10 టు 20 శాతం మార్పులు చేశామని, తాము ఎంత బెస్ట్ చేయగలమో, ఎక్కడ మార్చగలమో అక్కడ మార్చినట్టు తెలిపారు కిరణ్‌.  

`దిల్‌ రూబా` వల్ల నేను చాలా మారిపోయాను..

`దిల్ రూబా` సినిమాతో తనలో వచ్చిన మార్పు గురించి చెబుతూ, `సినిమా చేసేప్పుడు నేను కూడా కొంత మారాను. ఊరికే సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటల విలువ తీయొద్దు అనుకున్నాను. మనిషి మోసం చేసినప్పటి నుంచే దేవుడు అతనితో మాట్లాడటం మానేశాడు, తప్పు చేయని ప్రతివాడూ హీరోనే, కానీ చేసిన తప్పు తెలుసుకున్నవాడు ఇంకా పెద్ద హీరో లాంటి హీరో చెప్పే డైలాగ్స్ హిట్టింగ్ గా ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ తో మూవీ అంతా ప్యాకేజ్ లా ఉంటుంది.

సినిమా నా పేరు మీద థియేటర్స్ లోకి వస్తుంది కాబట్టి నేను మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడివరకు అవుతాను. హీరోగా అది నా బాధ్యతగా భావిస్తా. ఈ ఇయర్ నావి రెండు చిత్రాలు వస్తాయి. నెక్ట్స్ ఇయర్ నుంచి ఏడాదికి మూడు సినిమాలు కనీసం రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తా. `దిల్ రూబా` తర్వాత వెంటనే `కె ర్యాంప్` మూవీ ఉంటుంది` అని చెప్పారు కిరణ్‌ అబ్బవరం. 

read  more: ఆసుపత్రి బెడ్‌పై అమ్మ, మరో మహిళతో నాన్న.. ఆ దారుణాన్ని తలుచుకుని యాంకర్‌ సౌమ్యరావు కన్నీళ్లు

`క` తర్వాత కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది..

`క` సినిమా తనలో తెచ్చిన మార్పు గురించి చెబుతూ,  గతంలో కొన్ని సినిమాలు మొహమాటినికి పోయి చేశాను. అవి సరిగా ఆడలేదు. కానీ ఆ తప్పులకు రిగ్రెట్ కావడం లేదు. ఇకపై మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా. `క` సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను చూసే తీరు మారింది. మంచి సినిమా చేయాలని కష్టపడుతున్నాడు అనే పాజిటివ్ ఒపీనియన్ నాపై మొదలైంది. దాన్ని కాపాడుకుంటూ జర్నీ చేస్తా.

ప్రస్తుతం నాలుగు చిత్రాలు చేస్తున్నా. ఈ నాలుగు చిత్రాలు వేటికవి పూర్తిగా భిన్నమైనవి. ఒకటి కల్ట్ లవ్ స్టోరీ, మరొకటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా, నాలుగోది లంకె బిందెల వేట నేపథ్యంలో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. 3 పార్ట్ మూవీగా తీస్తున్నాం` అని చెప్పారు కిరణ్‌ అబ్బవరం.

ఇక `దిల్ రూబా` సినిమాలో కిరణ్‌కి జోడీగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. 

read  more: Aishwarya Rai vs Amitabh Bachchan: ఇద్దరిలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బులున్నాయి? తెలిస్తే షాకే

also read: Nagarjuna: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ డైరెక్టర్‌తో నాగార్జున సినిమా? ఇద్దరికీ సాహసమే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios