Oppo F29 5G సిరీస్: బడ్జెట్ ధర.. ఫీచర్లేమో ప్రీమియం!
స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం మరో మొబైల్ విపణిలోకి వచ్చేస్తోంది. అందుబాటు ధరలో, అద్భుతమైన ఫీచర్లతో ఉన్న ఆ స్మార్ట్ ఫోనే Oppo F29 5G సిరీస్. మార్చి 20న దుమ్మురేపనుంది! ఒప్పో F29 5G సిరీస్ మొబైల్స్ మిలిటరీ ట్యాంక్ లాంటి ధృడమైన డిజైన్‌తో, అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. ఈ మొబైల్స్ గురించిన సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

అమెజాన్లో లభ్యం
భారతదేశంలో తన కొత్త F29 5G సిరీస్ మొబైల్స్‌ను విడుదల చేయడానికి ఒప్పో రెడీ అవుతోంది. రెండు మోడల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఒప్పో F29 5G సిరీస్ మొబైల్స్ మార్చి 20న మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. అమెజాన్‌లో కొనొచ్చు.

రంగులు: ఒప్పో F29 5G: గ్లేసియర్ బ్లూ, సాలిడ్ పర్పుల్. ఒప్పో F29 ప్రో 5G: గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్.
ఫీచర్లు: 360 డిగ్రీల ఆర్మర్ బాడీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది.
ధర (లీక్): ఒప్పో F29 ప్రో 5G మొబైల్ రూ. 25,000 లోపే ఉంటుందట. 8GB + 128GB, 8GB + 256GB స్టోరేజ్‌లో వస్తుంది.
ఎక్కడ కొనొచ్చు: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ ఒప్పో ఇండియా ఈ-స్టోర్