Affordable Bikes ధర చౌక.. మైలేజీ కేక! ఇవే టాప్ బైక్ లు..
చౌకైన టాప్ 5 బైక్స్: మోటార్ సైకిల్ ని వాడకుండా రోజు గడవని వాళ్లు దేశంలో కోట్లమంది ఉన్నారు. అందులో అత్యధికులు మంచి మైలేజీ ఇచ్చే తక్కువధర బైక్ లనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ధర తక్కువ, మంచి మైలేజీ ఎక్కువ ఇచ్చే బెస్ట్ చౌక బైక్స్ పరిచయం చేస్తున్నాం.

హీరో హెచ్ఎఫ్ 100
ఇది చాలా తక్కువ ధరలో ఉండే బైక్. ఈ మోటార్ సైకిల్ లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హీరో ఈ బైక్ ధర రూ.59,018 (ఎక్స్ షోరూం ధర).

రెండో స్థానంలో టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర రూ.59,881 (ఎక్స్ షోరూం ధర) నుంచి మొదలవుతుంది (Top 5 Cheapest Bikes in India). ఈ బైక్‌పై లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది.
తర్వాత స్థానంలో హెచ్ఎఫ్ డీలక్స్
హెచ్ఎఫ్ డీలక్స్ మైలేజ్ లీటరుకు 75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అలాగే, ధర కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ షోరూమ్ ధర రూ.59,998 నుంచి మొదలవుతుంది (Low Cost Bike).
హోండా షైన్
హోండా షైన్.. ఇది ఒక అద్భుతమైన బైక్ అని చెప్పొచ్చు. దీని ధర రూ.66,900 నుంచి మొదలవుతుంది. ఇది ప్రధానంగా 100 సీసీ బైక్. దీని మైలేజ్ లీటరుకు 65 కిలోమీటర్లు.
టీవీఎస్ రేడియన్
చివరిగా టీవీఎస్ రేడియన్ బైక్ గురించి చూద్దాం. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 63 కిలోమీటర్లు. ఈ బైక్ ధర రూ.70,720 (ఎక్స్ షోరూం) నుంచి మొదలవుతుంది.