Adhi Dha Surprisu Song : కేతిక శర్మ అదిరిపోయే ఐటమ్ సాంగ్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, కారణం ఏంటంటే?

Adhi Dha Surprisu Song Controversy : ఐటమ్ సాంగ్స్ కు ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే. కాని ఈ పాటలే వివాదాలకు కూడా కారణం అవున్నాయి.  సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్స్ గా కూడా నిలుస్తున్నాయి. తాజాగా ఓ సాంగ్ ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతోంది. కారణం ఏంటంటే? 

Kethika Sharma's Bold Item Song Sparks Controversy, But Receives Huge Response Online in telugu jms

Adhi Dha Surprisu Song Controversy : ఈమధ్య కాలంలో ఐటం సాంగ్స్ హవా పెరిగిపోయింది. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో ఇవి బాగా వర్కౌట్ అవుతున్నాయి. దాంతో మేకర్స్  స్పెషల్  సాంగ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఇవే పాటలు వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి.  కొన్ని ఐటెం డ్యాన్స్ స్టెప్పులు ట్రోలర్స్ చేతికి చిక్కుతుండగా..  మరికొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. 'పుష్ప' సినిమాలో సమంత-అల్లు అర్జున్ డ్యాన్స్, 'పుష్ప 2'లో శ్రీలీల స్టెప్పులు, షెహనాజ్ గిల్ పాడిన 'సజన వే సజన' పాట కూడా దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు, కేతికా శర్మ చేసిన ఓ ఐటం సాంగ్ వివాదానికి దారి తీసింది. 

నితిన్-శ్రీలీల జంటగా రాబిన్ హుడ్  సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్' . ఈ మూవీని  మార్చి 28న రిలీజ్ చేయబోతున్నారు. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నితిన్ కాంబినేషన్ లో శ్రీలీలకు ఇది రెండో సినిమా. గతంలో 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇక వీరి కాంబోలో అద్భుతమైన డ్యూయోట్లు ప్లాన్ చేశాడు దర్శకుడు. అంతే కాదు ఈసినిమాలోనే అదరిపోయే ఐటమ్ సాంగ్ కూడా ఉంది.

కేతిక శర్మ ఐటమ్ సాంగ్:

ఈ సినిమాలో హీరోయిన్ కేతిక శర్మ  ఐటం సాంగ్ చాలా స్పెషల్ కాబోతోంది.  ఈ సాంగ్ పేరు కూడా "అది ద స్పెషల్". ఇందులో బోల్డ్ నెస్ డోస్ కాస్త ఎక్కువైనట్టు కనిపిస్తోంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసినఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం రాశారు. ఈ ఐటెం సాంగ్ తో  నితిన్, శ్రీలీల కూడా కనిపించారు. జివి ప్రకాష్ స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈసాంగ్ లో బోల్డ్ నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ట్రోలింగ్ కు గురవుతోంది. . 

మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసుకున్న మల్లె పువ్వుల జాకెట్. దానికి తగ్గట్టు కేతిక  వేసిన బోల్డ్ స్టెప్స్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సాంగ్ లో భాగంగా తాను వేసుకున్న స్కర్ట్ పైకి లాగడాన్ని విమర్శిస్తున్నారు. ఈ వింత చర్యలపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతి ఎక్కడికి పోయింది? ఆ స్కర్టును అలా లాగడంలో అర్ధం ఏమిటి అంటూ  కొందరు ప్రశ్నించారు. 

 


"అది ద స్పెషల్"  సాంగ్ కు భారీ  రెస్పాన్స్: 

అయితే ఈ పాటపై ఎన్ని విమర్శలు వచ్చినా, యూట్యూబ్ లో పాటకు మాత్ర అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాంగ్ రిలీజ్ అయిన  17 గంటల్లోనే 2.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.  ఇక ఈసినిమాలో నితిన్, శ్రీలీలతో పాటుగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, షైన్ థామ్ చాకో, వెన్నెల కిషోర్, మైమ్ గోపి తదితరులు నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈసినిమాకు  సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios