గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న యజమానిని కాల్చిన పిట్‌బుల్! ఇదేం వింతరా బాబూ..
ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తో బెడ్ పై పడుకొని రొమాంటిగ్గా కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు ఆ యజమాని పిట్ బుల్ కుక్క కాల్పులు జరిపింది. ఈ విచిత్ర సంఘటన అమెరికాలో జరిగింది. అదృష్టవశాత్తూ యజమాని గాయాలతో బయటపడ్డాడు.

అమెరికాలో ఓ కుక్క తన యజమానిని కాల్చిన విచిత్రమైన సంఘటన జరిగింది. కుక్క యజమానిని కాల్చడమా? ఇది ఎలా సాధ్యం? అని మీరు ఆశ్చర్యపోవడం నిజం. కానీ ఈ సంఘటన నిజంగా జరిగింది. అది ఎలా జరిగిందంటే..
సంఘటన ఎలా జరిగింది?
అమెరికాలోని టెన్నెస్సీలోని మెంఫిస్‌లో ఒక వ్యక్తి సోమవారం తెల్లవారుజామున తన గర్ల్‌ఫ్రెండ్ పక్కన పడుకున్నప్పుడు కుక్క కాల్పులు జరిపిందంట. కుక్కకు ద్వేషమా, తనతో గర్ల్‌ఫ్రెండ్ పడుకున్నందుకు కుక్కకు కడుపు మంటా అనుకోకండి. అతను మంచం మీదే లోడెడ్ గన్ (అమెరికాలో ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవడం సాధారణం). పెట్టుకుని పడుకున్నాడు. ఆ సమయంలో కుక్క మంచం మీదకు దూకింది. కుక్క కాలు నేరుగా గన్ ట్రిగ్గర్ మీద పడింది, దీనివల్ల అనుకోకుండా కాల్పులు జరిగాయి. ఫలితంగా నిండి ఉన్న గన్ నుండి బుల్లెట్ దూసుకుపోయి యజమాని తొడను చీల్చింది. అదృష్టవశాత్తూ అతను గాయాలతో బయటపడ్డాడు. బుల్లెట్ తగలగానే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
యజమానిని కాల్చిన కుక్క పిట్‌బుల్
అలాగే తనకు తెలియకుండానే యజమానిని కాల్చిన కుక్క పిట్‌బుల్ జాతికి చెందిన కుక్క, ఇవి ప్రమాదకరమైన దాడికి పేరుగాంచాయి. ఇదే కారణంతో ఈ జాతి కుక్కలను పెంచుకోవడానికి చాలా దేశాల్లో నిషేధం ఉంది. ఇదిలా ఉంటే యజమానిని కాల్చిన కుక్క పేరు ఓరియో, యజమాని మంచం మీదకు ఈ కుక్క దూకినప్పుడు దాని కాలు తగలడంతో తుపాకీ ట్రిగ్గర్ అయి యజమాని గాయపడ్డాడని ఈ ఘటన గురించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని పోలీసులు తెలిపారు.
ఇదే మొదటిసారి కాదు,
అయితే కుక్కలు ఇలా పొరపాటున కాల్పులు జరపడం ఇదే మొదటిసారి కాదు, రెండు సంవత్సరాల క్రితం, అమెరికాలోని కాన్సాస్‌లో జర్మన్ షెపర్డ్ కుక్క వేటాడుతున్న రైఫిల్‌ను అనుకోకుండా తొక్కడంతో 30 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అలాగే 2018లో అయోవాకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన పిట్‌బుల్-ల్యాబ్రడార్ మిశ్రమ జాతి కుక్కతో కాలికి కాల్పులు జరుపుకున్నాడు.