'లవ్ గురు' అంటూ సందడి చేయబోతున్న మృణాళిని రవి లేటెస్ట్ ఫొటోస్
యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది.

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి.
మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. ఈ మూవీలో మృణాళిని భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు.
మృణాళిని క్యూట్ లుక్స్ అంటేనే యువతకి ఇష్టం. ఆమెకి అదే తరహా పాత్రలు వస్తున్నాయి. కానీ మృణాళిని కెరీర్ మలుపు తిప్పే బిగ్ హిట్ మాత్రం దక్కడం లేదు.
గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మృణాళిని విజయ్ ఆంటోని సరసన 'లవ్ గురు' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో విజయ్ ఆంటోని, మృణాళిని రీసెంట్ గా హైదరాబాద్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.
లవ్ గురు" సినిమాలో లీలా అనే క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన హీరో, ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. లీలా క్యారెక్టర్ లో నటించేందుకు నేను కలైరాణి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ పాత్రలో పర్ ఫెక్ట్ గా నటించేందుకు ఆ మేడమ్ ఇచ్చిన ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడింది.
విజయ్ ఆంటోనీని ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్స్ లో చూశారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్ గా చూస్తారు. అది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ గారికి గర్ల్ ఫ్యాన్స్ పెరుగుతారు.
అలాగే రొమాంటిక్ స్క్రిప్ట్స్ కూడా చాలా వస్తాయి. నేను ఈ షూటింగ్ టైమ్ లో ఆయనను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని.తాజాగా మృణాళిని బ్లాక్ శారీ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.