MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా డాటర్ నిహారిక జిమ్ వర్కౌట్స్.. వాళ్ళిద్దరితో షాకింగ్ సెల్ఫీలు వైరల్

మెగా డాటర్ నిహారిక జిమ్ వర్కౌట్స్.. వాళ్ళిద్దరితో షాకింగ్ సెల్ఫీలు వైరల్

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 30 2023, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

27

నిహారిక వ్యక్తిగత వివాదాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పబ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత పోలీసులు నిహారికకు క్లీన్ చిట్ ఇవ్వడం లాంటి న్యూస్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. 

37

అయితే కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య మధ్య రిలేషన్ బాగా లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. నిహారిక సోషల్ మీడియాలో చాలా కాలంగా చైతన్య గురించి ప్రస్తావన లేదు. అలాగే చైతన్య కూడా తన సోషల్ మీడియా నుంచి నిహారిక ఫొటోస్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరూ విడాకుల వైపు వెళుతున్నారనే అనే షాకింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

47

ఈ నేపథ్యంలో నిహారిక సోషల్ మీడియా పోస్ట్ లపై అందరి దృష్టి పడింది. నిహారిక జిమ్ వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ ని కాపాడుకునే పనిలో ఉంది. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ ని నిహారిక పంచుకుంది. 

57

నిహారిక తన ఫిట్నెస్ ట్రైనర్ తో సెల్ఫీ తీసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ డ్రెస్ లో నిహారిక జిమ్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోస్ కి నిహారిక 5 ఏఎమ్ క్లబ్ అనే కామెంట్ పెట్టింది. 

67

అలాగే వరుణ్ సందేశ్ సతీమణి నటి వితిక షెరు కూడా అదే జిమ్ లో వర్కౌట్స్ చేస్తోంది. నిహారిక ఆమెతో కూడా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. ఇద్దరూ జిమ్ వేర్ లో ఉన్న దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అయితే గతంలో నిహారిక తన భర్త చైతన్యతో కలసి జిమ్ వర్కౌట్స్ లో పాల్గొనేది. 

77

ఆ ఫొటోస్ ని కూడా షేర్ చేసేది. కానీ ఇప్పుడు నిహారిక ఒంటరిగా జిమ్ వర్కౌట్స్ చేస్తుండడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైతన్య.. నిహారికతో ఉన్న ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నాడు. ఈ మెగా జంట అడుగులు ఎటువైపు వెళుతున్నాయో అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్- స్వప్న, కాశీ విడాకులు- దశరథ ఆవేదన
Recommended image2
Illu Illalu Pillalu: భాగ్యం శాడిజం, సాగర్ ని చావబాదిన రామరాజు, నీకు పిల్లల్ని పెంచడం రాదన్న నర్మద తండ్రి
Recommended image3
Samantha: నాగచైతన్య నుంచి విడిపోవడానికి సమంత ఎన్నికోట్ల భరణం తీసుకుందో తెలుసా? ఆమె గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved