- Home
- Entertainment
- Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి విరహ వేదన.. వయ్యారాలు ఒలికిస్తూ హాట్ స్ట్రక్చర్ తో కిక్కిచ్చే ఫోజులు
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి విరహ వేదన.. వయ్యారాలు ఒలికిస్తూ హాట్ స్ట్రక్చర్ తో కిక్కిచ్చే ఫోజులు
లావణ్య త్రిపాఠి టాలీవుడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి.అందాల రాక్షసి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

లావణ్య త్రిపాఠి టాలీవుడ్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి.అందాల రాక్షసి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్ తో లావణ్య కుర్రాళ్లని భలే మాయ చేసింది.
ఎలాంటి గ్లామర్ షో లేకుండా తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో లావణ్య త్రిపాఠి మెస్మరైజ్ చేసింది.. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది. అప్పుడప్పుడూ మాత్రమే ఆమెని విజయాలు పలకరిస్తున్నాయి.
కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది.
రీసెంట్ గా లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్త్ డే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో లావణ్య నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. విభిన్నమైన పాత్రలో లావణ్య నటన కొత్తగా ఉంది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫన్ అండ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో హ్యాపీ బర్త్ డే చిత్రం తెరకెక్కింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. కళ్ళు చెదిరే హాట్ లుక్ లో గ్రీన్ డ్రెస్ లో లావణ్య మెరిసింది. విరహవేదనతో ఉన్నట్లుగా లావణ్య ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేనివిధంగా ఉన్నాయి.
ఆకర్షించేలా ఉన్న డ్రెస్ లో లావణ్య త్రిపాఠి వయ్యారంగా ఫోజులు ఇస్తోంది. హాట్ లిప్స్, మత్తు చూపులతో లావణ్య త్రిపాఠి నెటిజన్లని సమ్మోహన పరుస్తోంది. హ్యాపీ బర్త్ డే తర్వాత లావణ్య ఎలాంటి చిత్రంలో నటించబోతోందో వేచి చూడాలి.