- Home
- Entertainment
- Kriti Sanon Photos :బ్రౌన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న కృతి సనన్.. ఫైర్ ఎమోజీ వదిలిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Kriti Sanon Photos :బ్రౌన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న కృతి సనన్.. ఫైర్ ఎమోజీ వదిలిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. ట్రెండీ అవుట్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా కృతి సనన్ తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)అరాచకానికి పూనుకుంది. సోషల్ మీడియా యూజర్లపై గ్లామర్ దాడి చేస్తోంది. నిలువెత్తు అందాల పొడుగుకాళ్ల సుందరి హాట్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. బ్రౌన్ ట్రెండీ వేర్ లో కృతి కుర్రాళ్లను కవ్విస్తోంది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కృతి సనన్ కు ఇండస్ట్రీలో కొంత గుర్తింపు లభించింది.
దీంతో మహేష్ మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేశారు. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.
హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 వంటి హిట్ చిత్రాలు ఆమెకు బాలీవుడ్ లో విజయాలు అందించాయి. 2019 ఆమెకు బాగా కలిసొచ్చింది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో అవకాశం రావడంతో పాటు, హిట్స్ దక్కాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఆమె గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బచ్చన్ పాండే’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. కాగా, మరో రెండు భారీ చిత్రాల్లోనూ కృతి సనన్ నటిస్తోంది. దీంతో ఆమె చేతిలో మొత్తం మూడు చిత్రాలున్నాయి.
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ లోనూ జానకి పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న గణపత్ మూవీ చేస్తున్నారు. గణపత్ రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. మరోవైపు ఇటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హాట్ మరియు, గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. బ్రౌన్ కలర్ డ్రెస్ లో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ఒక హాట్, మూడు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ పెట్టింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా లైక్ లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.