MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ రామాయణం నేను చూడలేదు.. ప్రభాస్ 'ఆదిపురుష్'పై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ రామాయణం నేను చూడలేదు.. ప్రభాస్ 'ఆదిపురుష్'పై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 06 2023, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీనితో చిత్ర యూనిట్ రిపేర్లు చేయడానికి ఆదిపురుష్ రిలీజ్ వాయిదా వేసింది. లేకుంటే ఈ సంక్రాంతికి ఆదిపురుష్ చిత్రం రిలీజై ఉండాల్సింది. ఆదిపురుష్ టీజర్ చూసి పురాణాల్ని ఇష్టపడే వారు.. ప్రభాస్ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. రాముడంటే ఏంటో అందరి మదిలో ఒక విజువల్ ఉంటుంది. 

36

దానికి భిన్నంగా చూపించే ప్రయత్నం చేసిన ఓం రౌత్ విమర్శల పాలయ్యారు. మరి ఈ చిత్రాన్ని మెప్పించే విధంగా ఎలా తీర్చి దిద్దుతారో వేచి చూడాలి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సనన్ సీతాదేవిగా నటిస్తోంది. 

46

ప్రస్తుతం కృతి సనన్, కార్తీక్ ఆర్యన్ జంటగా నటించిన షెహజాదా చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది అల వైకుంఠపురములో చిత్రానికి రీమేక్. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. సీత పాత్ర నాకు ఎంతగానో నచ్చింది అని పేర్కొంది. 

56

రామానంద్ సాగర్ రామాయణం గురించి చాలా గొప్పగా చెబుతుంటారు.  కానీ నేను ఆ రామాయణం చూడలేదు. నాలాంటి వారందరికీ ఆదిపురుష్ చిత్రం బాగా నచ్చుతుంది అని పేర్కొంది. ఇప్పటి తరం పిల్లలకు ఆదిపురుష్ చిత్రం రామాయణం గురించి అవగాహన పెంచుతుంది అని తెలిపింది. ఇది కేవలం చిత్రం మాత్రమే కాదు.. ఒక విజువల్ వండర్ లాగా ఉంటుంది. 

66
Adipurush

Adipurush

ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ విఎఫెక్స్ వర్క్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. పలుమార్లు రిలీజ్ వాయిదా పడడం వల్ల బడ్జెట్ పెరిగిపోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
దిల్ రాజు
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image2
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Recommended image3
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved