MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?

Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ `కొరియన్‌ కనకరాజు`తో ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. ఈ మూవీ లాభాల్లో రన్‌ అవుతుంది. అయితే మూడో వారంలో మాత్రం ఈ మూవీ పూర్తిగా డల్‌ అయిపోయింది. థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 20 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకున్న కొరియన్‌ కనకరాజు
Image Credit : X/@UV_Creations

థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకున్న కొరియన్‌ కనకరాజు

వరుణ్‌ తేజ్‌, రితిక నాయక్‌ జంటగా `కొరియన్‌ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్‌, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్‌ గౌడ్‌, సునీల్‌, టెంపర్‌ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్‌లో రన్‌ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొరియన్‌ కనకరాజు 13 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు 13 రోజుల కలెక్షన్లు

ఈ సినిమా ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్‌ గా క్లోజ్‌ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Related image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
34
భారీ లాభాల్లో కొరియన్‌ కనకరాజు
Image Credit : X/@UV_Creations

భారీ లాభాల్లో కొరియన్‌ కనకరాజు

ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్‌ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్‌ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్‌ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు. ఇది యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంతకు ముందు ఈ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. దానికి `కొరియన్‌ కనకరాజు` అడ్డు కట్ట వేసింది.

44
కొరియన్‌ కనకరాజు కథ ఇదే
Image Credit : X/@UV_Creations

కొరియన్‌ కనకరాజు కథ ఇదే

`కొరియన్‌ కనకరాజు` చిత్రం కథేంటనేది చూస్తే, రాయలసీమలోని ఓ విలేజ్‌లో కనకరాజు చిన్నపాటి గల్లీరౌడీలాంటివాడు. కానీ వ్యక్తిగా మంచోడు. తన ఫ్రెండ్‌ సత్య. ఆయనకు ఫోటో స్టూడియో ఉంటుంది. కనకరాజుకి లోకల్‌ గ్యాంగ్‌తో గొడవలుంటాయి. ఓ రోజు కనకరాజుని బార్ లో రౌండప్‌ చేస్తారు. వాళ్లని కొట్టే క్రమంలో ఒక సీసాలో మందు పోసుకొని తాగుతాడు. అందులో కొరియన్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఆత్మ ఉంటుంది. అది కనకరాజు బాడీలోకి వెళ్తుంది. అది రోజుకి అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. కనకరాజు గ్యాంగ్‌ స్టర్‌గా మారి ఎలాంటి రచ్చ చేశాడు, ఆ ఆత్మని కనకరాజు నుంచి పోగొట్టేందుకు సత్య ఏం చేశాడనేది సినిమా. ఇది ఆద్యంతం కామెడీగా సాగుతుంది. థ్రిల్‌కి గురి చేస్తుంది. యాక్షన్‌తో మెప్పిస్తుంది. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. వరుణ్‌ తేజ్‌ కూడా బాగా చేశాడు. తన బెస్ట్ ఇచ్చాడు. మొత్తంగా చాలా రోజుల తర్వాత హిట్‌ అందుకున్నాడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Recommended image2
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Recommended image3
Agnipariksha season 2 Review: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న అగ్నిపరీక్ష 2.. బిగ్ బాస్ కోసం వెళ్తే చుక్కలు చూపిస్తున్నారుగా!
Related Stories
Recommended image1
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Recommended image2
Irumudi Movie Review: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ, రవితేజ దెబ్బకు పూనకాలు గ్యారెంటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved