బ్లాక్ శారీలో మైకం తెప్పిస్తున్న కీర్తి సురేష్.. 'దసరా' కోసం రంగంలోకి దిగిన మహానటి
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది.
నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బ్లాక్ శారీలో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేస్తోంది. నాజూకు నడుము, చిరునవ్వుతో కీర్తి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపిస్తున్నాయి. కీర్తి సురేష్ నాజూకైన రూపాన్ని ఎంత వర్ణించినా తక్కువే.
కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. నాని ఊరమాస్ అవతారంలో కెరీర్ లో తొలిసారి నటిస్తున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మార్చి 30న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దీనితో కీర్తి సురేష్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగింది.
ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఇలా బ్లాక్ శారీలో వయ్యారాలు ఒలికిస్తూ మెరిసింది. కీర్తి సురేష్ ఇలా చీరకట్టులో కనిపిస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు దసరా చిత్రంలో కూడా కీర్తి సురేష్ పోషిస్తోంది రెగ్యులర్ గ్లామర్ రోల్ కాదు. మరి ఈ విభిన్నమైన పాత్రలో కీర్తి ఎలా నటించిందో చూడాలి.
అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి.