MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karthika deepam: మోనితని ఛీ కొట్టిన కార్తీక్... కార్తీక్ ప్రేమను సంపాదించడం కోసం మోనిత కొత్త నాటకం?

Karthika deepam: మోనితని ఛీ కొట్టిన కార్తీక్... కార్తీక్ ప్రేమను సంపాదించడం కోసం మోనిత కొత్త నాటకం?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 13వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Sep 13 2022, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. దీప పూజ అయిపోయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మోనిత, కార్తీక్ దగ్గరికి వెళ్లి అసలు నువ్వు ఎప్పుడు దీప ఇంటికి వెళ్లావు? అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, ఇలా జరిగినది చెప్తాడు.ముందు రోజు రాత్రి కార్తీక్, దీప దగ్గరికి వస్తాడు. నువ్వు ఎప్పుడూ నన్ను డాక్టర్ బాబు అని అంటావు కదా, నువ్వు నా భార్య అని నువ్వు అన్న మాట నాకు గుర్తొచ్చింది అని అంటాడు.ఇంకేమైనా గుర్తొచ్చిందా అని దీపా అడగగా లేదు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటాడు కార్తీక్.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 గుర్తు వస్తుంది లెండి అనీ దీప అనగా, ఆ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా మోనిత అడిగితే నువ్వు పూజకు రాను అన్నావు కదా నేను పిలుస్తాను రా అని అంటాడు కార్తీక్. మీరు పిలిచారు కదా నేను తప్పకుండా వస్తాను కానీ పూజ లో మీరు ఒక్కరే కూర్చోవాలి. ఎందుకంటే మీ గతం గుర్తుకు రావాలి అని, మీ భార్య పిల్లలు బాగా ఉండాలి అని కోరుకోండి.ఇది ఒకటే నా దగ్గర నుంచి నేను కోరుకుంటుంది అని అనగా,సరే నా భార్య పిల్లలు కోసం నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నేను ఒక్కడినే కూర్చుంటాను అని అంటాడు కార్తిక్.
 

37

 అప్పుడు దీప పేపర్లో రాసి కార్తీక్ జేబులో పెడుతుంది. ఇదంతా విన్న మోనితా అరుస్తూ, అయినా నువ్వు తన ఇంటికి వెళ్లాల్సిన పని ఉంది కార్తీక్ తను నిన్ను ఒక్కడినే కూర్చొమన్నప్పుడే నీకు అర్థం కాలేదా, నిన్ను నన్ను విడగొడుతుంది అని   అరుస్తుంది.అప్పుడు కార్తీక్ కి చిరాకు వచ్చి అయినా ఎప్పుడూ ఆ వంటలక్క మీదే ఎందుకు పడతావు మోనిత,తను నా భార్య పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటుంది కదా అంటే నీ గురించే కదా ఏం నువ్వు నా భార్యవి కాదా? మరి ఎందుకు అంత కోప్పడుతున్నావు? అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

47

 అప్పుడు మోనిత, పరిస్థితి చేయి జారిపోయేలాగున్నది కార్తీక్,దీప కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నేను ఇంత ప్రేమగా చూసుకుంటే దీని కోసమా అని అనుకుంటుంది.ఆ తర్వాత సీన్లో సౌందర్య కుటుంబం వినాయక చవితి పూజ చేస్తుంది.అప్పుడు హిమ తన బ్యాగు తో పాటు శౌర్య ఒకప్పుడు వాడిన బ్యాగ్ ని తీసుకువచ్చి వాళ్ళ పుస్తకాలను వినాయకుడు ముందు పట్టి చదువు బాగా రావాలి అని కోరుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత హిమ సౌందర్య దగ్గరికి వెళ్లి నానమ్మ శౌర్యను తెచ్చుకుందాం నానమ్మ అని అనగా సౌందర్య,అది రాను అంటుందే.
 

57

 బలవంతంగా తెస్తే మనకు కనిపించకుండా ఇంకెక్కడికైనా పారిపోతుంది అని అక్కడే ఉంచాను, ఎప్పటికైనా తిరిగి వస్తుందిలే అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత సీన్లో దీప వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి జరిగినది చెప్తుంది. డాక్టర్ బాబు గతం గుర్తు తెచ్చుకోవడానికి  ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాగా చూస్తే ఎప్పటికైనా గతం గుర్తొస్తుంది అని అంటుంది. అప్పుడు అన్నయ్య నాకు డాక్టర్ బాబు ని, మోనిత నీ  ఒకసారి చూపించమ్మా నాకు చూడాలని ఉన్నది అని అంటాడుఆ తర్వాత సీన్లో మోనిత తన గదిలో కూర్చుని, అయినా  దీప అంటే కార్తీక్ కి  ఎందుకు అంత ఇష్టం పెరుగుతుంది. నేనెప్పుడూ కార్తీక్ ని ప్రేమగా చూసుకోవడమే తప్ప, నన్ను ఎప్పుడు కార్తీక్ భార్యగా చూసుకోలేదు.
 

67

ఇప్పుడు కార్తీక్ నామీద ప్రేమ రావాలంటే నేను ఏం చేయాలి నాకు ఒంట్లో బాగోకపోతే ప్రేమ వస్తుంది కదా అని చెప్పి జ్వరం వచ్చినట్టు నటిస్తుంది. అప్పుడు కార్తీక్ అక్కడికి  వచ్చి ఏమైంది అని అనగా ఒంట్లో బాలేదుజ్వరము అని అంటుంది మోనిత. నేను నిన్ను ఇందాక తిట్టాను కదా దానివల్ల నీకు జ్వరం వచ్చినట్టు ఉంది. నన్ను క్షమించు, నాకు కూడా కోపం ఉంటుంది కదా అని అనగా నేను ఏం చేసినా నీ మంచి కోసమే కార్తీక్ మన మధ్య ఎవరూ రాకూడదని భయంతోనే ఇలా చేస్తున్నాను అని అంటాది మోనిత. అప్పుడు కార్తీక్, మోనిత తో, బంగారం నువ్వు ఇంకా భయపడొద్దు నేను వెళ్లి డాక్టర్లు తీసుకొస్తాను అని వెళ్తాడు. బయటికి వెళ్లి శివని వెతకగా అక్కడ శివ ఉండడు.
 

77

అదే సమయంలో దీప,వాళ్ళ అన్నయ్య అటువైపు వస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన విషయం తెలుసుకున్న దీప వాళ్ళ అన్నయ్యని అక్కడికి పంపుతుంది.  నేనే పంపించాను అని చెప్పొద్దు డాక్టర్ బాబు మళ్లీ మోనిత ట్రీట్మెంట్ తీసుకోదు అని అంటుంది. ఇంతలో మోనితకి నిజంగానే డాక్టర్ వేస్తే నాకు గుర్తు బయట పడుతుంది అని అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు. అప్పుడే డాక్టర్ని తెచ్చేసాడు ఏంటి అని మోనిత అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved