MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 'భారతీయుడు-2 ' ఓటిటి ఇష్యూ, మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు..

'భారతీయుడు-2 ' ఓటిటి ఇష్యూ, మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు..

కమల్, శంకర్ కాంబినేషన్ ,సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావటంతో ఇండియన్ 2 రైట్స్ ని అన్ని భాషాలకు కలిపి రికార్డ్ ఎమౌంట్ కు అంటే 120 కోట్లకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. 

2 Min read
Author : Surya Prakash
Published : Jul 30 2024, 06:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Indian 2

Indian 2


 కమల్‌హాసన్‌- ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు-2’. జులై 12న ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్  వ‌చ్చింది.  ఈక్రమంలో ఈ సినిమా ఓటీటీలో చూద్దామని  స్ట్రీమింగ్ కోసం మాత్రం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా ఆగ‌స్టులో స్ట్రీమ్ అవుతుంద‌నే వార్త‌లు వచ్చాయి. ఈ సినిమా మంచి డీల్ కే అమ్ముడుపోయిన‌ట్లు కూడా చెప్పుకున్నారు. అయితే, డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కానీ ఈ లోగా ఓటిటి విషయమై ఓ ట్విస్ట్ పడిదంని సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


కమల్, శంకర్ కాంబినేషన్ ,సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావటంతో ఇండియన్ 2 రైట్స్ ని అన్ని భాషాలకు కలిపి రికార్డ్ ఎమౌంట్ కు అంటే 120 కోట్లకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. ఇది చాలా పెద్ద ఎమౌంట్. సినిమా సూపర్ హిట్ అయ్యింటే పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ అవటంతో నెట్ ప్లిక్స్ వారు తాము ఇచ్చిన డబ్బులో కొంత వెనక్కి ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారని తమిళ సిని వర్గాల సమాచారం.

36


ఎగ్రిమెంట్ 120 కోట్లకు రాసుకున్నా ఆ మొత్తం ఇవ్వకుండా అడ్వాన్స్ గా సగం ఇచ్చారట. అయితే ఇప్పుడు అందులో కూడా కొంత వెనక్కి ఇవ్వమని నిర్మాణ సంస్దని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతతో చర్చలు జరుపుతున్నారట. ఎగ్రిమెంట్ రాసుకునేటప్పుడు సినిమా రిజల్ట్ ని బట్టి రిలీజ్ డేట్, ఎమౌంట్ ల విషయంలో మార్పులు ఉంటాయని చెప్పిన విషయం గుర్తు చేస్తున్నారు. దాంతో భారతీయుడు 2 నిర్మాతకు మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయ్యింది. ఈ విషయం తేలితే కానీ ఓటిటి డేట్ పై క్లారిటీ రాదు.
 

46


 28 ఏళ్ల క్రితం ఇదే కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్‌. సిద్దార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.  అయితే ఊహించని విధంగా  చిత్రానికి మొదటిరోజే భారీ ఫ్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా శంకర్‌పై విమర్శలు వెలువెత్తాయి. కంటెంట్‌ లేకుండా భారీగా ఖర్చుపెట్టారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అంటూ కమల్‌ అభిమనులతో పాటు సగటు ఆడియన్స్‌ కూడా నిరాశ చెందారు. 
 

56

 బ్లాక్ బస్టర్ లేదా యావరేజ్ లేక డిజాస్టర్ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ చెప్పడం ఈ మధ్య కష్టంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వాటి ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ రాదు. అలాగే ఇండియన్ 2 సినిమాను టాక్ పరంగా, కలెక్షన్స్ పరంగా చూసి ఓటీటీ రిలీజే చేయనున్నారు. 

66

ఇప్పుడు 'భార‌తీయుడు - 2' సినిమాకి కొన‌సాగింపుగా 'భార‌తీయుడు - 3' సినిమా ఉంటుంద‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా అనుకున్నంత‌గా రానించ‌క‌పోవ‌డంతో 'భార‌తీయుడు - 3' ఉండ‌క‌పోవ‌చ్చు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘భార‌తీయుడు’ సినిమాలో అవినీతిపై, స్వాతంత్య్రం రాక‌ముందు ఉన్న ప‌రిస్థితుల‌పై తెర‌కెక్కించారు. ఇక ‘భార‌తీయుడు - 2' లో కూడా అవీనీతిపై పోరాటం గురించే చూపించారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved