- Home
- Entertainment
- Kajal: భర్తతో రొమాంటిక్ గా ముద్దుల్లో కాజల్.. బేబీ బంప్ తో బికినీ పిక్స్ వైరల్, ఇంటర్నెట్ షేకింగ్
Kajal: భర్తతో రొమాంటిక్ గా ముద్దుల్లో కాజల్.. బేబీ బంప్ తో బికినీ పిక్స్ వైరల్, ఇంటర్నెట్ షేకింగ్
అతి త్వరలో కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ఫస్ట్ బేబీకి తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం నిండు గర్భవతి అయిన కాజల్ రిలాక్స్ అవుతోంది.

కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాజల్ అగర్వాల్ నిండు గర్భంతో ఉంటూ కూడా తన భర్తతో వెకేషన్స్ లో సందడి చేస్తోంది. తన భర్తతో కలసి సరదాగా బయటి ప్రపంచాన్ని ఆస్వాదిస్తోంది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ని నెటిజన్లతో పంచుకుంటోంది.
తాజాగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్ తో బికినీలో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలకు కాజల్ వాటర్ బేబీ అంటూ కామెంట్స్ పెట్టింది. బికినిలో ఉన్న కాజల్ పైన ట్రాన్స్ పరెంట్ బ్లూ క్లాత్ వేసుకుంది. అలాగే తన భర్తతో కలసి రొమాంటిక్ గా ముద్దుల్లో మునిగితేలుతోంది. కాజల్ అగర్వాల్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.