MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక వైపు రజనీకాంత్, మరో వైపు మహేష్ బాబు..పోటీకి దిగి సూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్, పెద్ద గొడవే

ఒక వైపు రజనీకాంత్, మరో వైపు మహేష్ బాబు..పోటీకి దిగి సూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్, పెద్ద గొడవే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కుటుంబ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. ఎక్కువగా మాస్ కమర్షియల్ చిత్రాలే చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కి పడ్డ హిట్స్ కూడా మాస్ చిత్రాలే అని చెప్పొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 29 2024, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కుటుంబ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. ఎక్కువగా మాస్ కమర్షియల్ చిత్రాలే చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కి పడ్డ హిట్స్ కూడా మాస్ చిత్రాలే అని చెప్పొచ్చు. అలాంటి టైంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎన్టీఆర్ తో ఒక ప్రయోగం చేశారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ ప్రయోగమే బృందావనం చిత్రం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ముందు పెద్ద గొడవే జరిగిందట. ఎన్టీఆర్ కూడా చాలా విషయాల్లో దిల్ రాజుతో విభేదించారట. 

 

36

దిల్ రాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాలి అని అనుకున్నారు. మీసాలు లేకుండా ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే చర్చ జరిగింది. ఎన్టీఆర్ ని మీసాలు లేకుండా చూపించాలి అంటే చిత్ర యూనిట్ లో చాలా మంది ఒప్పుకోలేదు. గొడవ చేశారు. కానీ ఆ లుక్కే ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. చెవి పోగు పెట్టి చూపించాం. 

 

46

కథ విషయంలో కూడా తారక్ చాలా గొడవ చేశాడు. కథలో ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని కూడా ఇన్వాల్వ్ అయినట్లు దిల్ రాజు తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక ఇక బృందావనం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఒకవైపు రజనీకాంత్ రోబో చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. మరోవైపు మహేష్ బాబు ఖలేజా కూడా రిలీజ్ అయింది. 

 

56

కానీ అది దసరా సీజన్. ఫ్యామిలీ మూవీ కావడంతో వారం ముందే ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలెబ్రెటీలకు ప్రీమియర్ షో వేశాం. అందరూ అద్భుతంగా ఉందని చెప్పారు. దీనితో రోబో, ఖలేజా చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ బృందావనం చిత్రాన్ని కూడా రిలీజ్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. 

 

66

సినిమా సూపర్ హిట్ అయింది. బృందావనం చిత్రం పట్ల ఎన్టీఆర్ తల్లి షాలిని చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఆ విధంగా ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం చేసిన మూవీ బృందావనం హిట్ అయినట్లు దిల్ రాజు తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru Leak: బాబీతో సినిమా టైటిల్ లీక్‌ చేసిన చిరంజీవి.. వామ్మో పవర్‌ఫుల్‌ టైటిల్‌?
Recommended image2
Roja: చంద్రబాబుని సొంత అన్నలా భావించా.. ఓడించడానికి కుట్ర చేశారు.. టీడీపీకి గుడ్‌ బై చెప్పడంపై రోజా స్టేట్‌మెంట్‌
Recommended image3
Ilaiyaraaja Magic: జోలపాట ట్యూన్ కాస్త మాస్ బీట్ గా.. ఇళయరాజా చేసిన మ్యాజిక్ తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved