MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే

OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే

OTT: బాలకృష్ణ ఎన్బీకే 111, వెంకటేస్‌ జనవరి 12న విడుదల, నాగచైతన్య వృషకర్మ చిత్రాలు ఒకే ఓటీటీలో రాబోతున్నాయి. ఇక వరుసగా ఈ సినిమాల జాతర జీ5లో రాబోతుంది. మరి ఆయా సినిమాలేంటో చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 30 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
ఒకే ఓటీటీలో వెంకీ, బాలయ్య, నాగచైతన్య సినిమాలు
Image Credit : Asianet News

ఒకే ఓటీటీలో వెంకీ, బాలయ్య, నాగచైతన్య సినిమాలు

ఓటీటీలో సినిమాలు ముందుగానే ఫిక్స్ అవుతున్నాయి. భారీ చిత్రాలు షూటింగ్‌ దశలోనే ఓటీటీ డీల్‌ సెట్‌ చేసుకుంటాయి. ఓటీటీ సంస్థలు కూడా ముందుగానే అగ్రిమెంట్‌ చేసుకుంటాయి. అలా జీ5లో ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు రాబోతున్నాయి. వెంకటేష్‌, బాలకృష్ణ, నాగచైతన్య సినిమాలు షూటింగ్‌ దశలోనే ఓటీటీ డీల్స్ సెట్‌ చేసుకున్నాయి. భారీ రేట్‌కి ఇవి డీల్స్ ని సెట్‌ చేసుకున్నాయి. మరి ఆయా సినిమాలు ఏంటి? వాటితోపాటు జీ5లో ఇంకా ఏఏ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌లు రాబోతున్నాయనేది చూస్తే.

బిగ్‌ ప్రొడక్షన్స్ తో జీ5 భారీ డీల్‌

ప్రముఖ నిర్మాణ సంస్థలు, బ్యానర్స్‌తో తెలుగు జీ5 పార్ట‌న‌ర్‌ఫిప్ కుదుర్చుకుంది. ఇందులో వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్, వృద్ధి సినిమాస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్, ఉదయ భాను ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్‌ఎల్‌పీ వంటి ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలతో కలిసి తెలుగు జీ5 ఈ భారీ లైనప్‌ను కుదుర్చుకుంది. ఒరిజినల్స్ విభాగంలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న‌ ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’తో పాటు.. జగపతి బాబు హోస్ట్‌గా ప్రేక్షకుల అభిమాన షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ మరోసారి సందడి చేయనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
జీ5 ఓటీటీలో రాబోతున్న సినిమాలు
Image Credit : Asianet News

జీ5 ఓటీటీలో రాబోతున్న సినిమాలు

ఇక సినిమా విభాగంలో కూడా ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను తెలుగు జీ5 అందిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న ‘లెనిన్’..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’..అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’..కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘వృషకర్మ’.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి నటిస్తున్న ‘కనక దుర్గ’ చిత్రాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. అలాగే ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు జీ5 ప్రేక్ష‌కులను అల‌రించ‌నుంది.

ఏఐ ఆధారిత స్టోరీస్‌ 

ఒరిజినల్స్, సినిమాలతో పాటు.. ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో కూడా తెలుగు జీ5 తన వినోద ప్రపంచాన్ని మరింత విస్తరిస్తోంది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి టైటిల్స్‌తో సరికొత్త కథనాలను ప్రేక్షకులకు అందించనుంది. అలాగే పిల్లల కోసం ‘బార్బరీక్’, ‘కుండక మండక్క’ వంటి కంటెంట్‌తో పాటు.. ఫిఫా, బుండెస్లీగా, కోప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను కూడా అందిస్తూ తన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తోంది. విభిన్న ఫార్మాట్లు, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కంటెంట్‌తో.. దక్షిణాది నుంచి అత్యుత్తమ వినోదాన్ని తెలుగు జీ5 అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఏదో ఒక ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు జీ5లో సిద్ధంగా ఉంది.

జీ5 తెలుగు, త‌మిళ్‌, మలయాళం బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ, `తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనంతో, సంప్రదాయానికి భిన్నంగా ఉండే కథలను ఆదరిస్తుంటారు. తమ భావోద్వేగాలకు, మనసుకు దగ్గరయ్యే సహజత్వాన్ని కూడా ఎంతో విలువగా భావిస్తారు తెలుగు ఆడియెన్స్‌. గత కొన్నేళ్లుగా క్రియేటర్స్‌, నిర్మాణ సంస్థలు, ప్రేక్షకులతో మేం ఏర్పరుచుకున్న పార్ట్‌న‌ర్‌షిప్‌ ద్వారా మార్కెట్‌లో ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది. అదే ఆలోచనతో ఈ కొత్త కంటెంట్ లైనప్‌ను రూపొందించాం. ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ నుంచి ‘శ్రీమతి’, ‘పంచనామా’ వంటి ఒరిజినల్స్ వరకు.. ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన కంటెంట్‌తో పాటు సరికొత్త కథలను కూడా ఈ లైనప్‌లో అందిస్తున్నాం` అని చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నందమూరి బాలకృష్ణ
దగ్గుబాటి వెంకటేష్
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Related Stories
Recommended image1
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Recommended image2
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved