- Home
- Entertainment
- Janhvi Kapoor: అందాలన్నీ బంధించి కుర్రాళ్లని కవ్విస్తున్న జాన్వీకపూర్.. హాట్‌నెస్ మాత్రం తగ్గేదెలే
Janhvi Kapoor: అందాలన్నీ బంధించి కుర్రాళ్లని కవ్విస్తున్న జాన్వీకపూర్.. హాట్‌నెస్ మాత్రం తగ్గేదెలే
అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తన హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంటుంది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఈ సారి వెరైటీగా కవ్విస్తుంది. కుర్రాళ్లని హంట్ చేస్తుంది.

జాన్వీకపూర్(Janhvi Kapoor).. వెండితెరపై కాస్త పొదుపుగానే అందాలు ఆరబోస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు ఎలాంటి రూల్స్ లేవు. ఎలాంటి కండీషన్స్ లేవు. దీంతో రెచ్చిపోతుంది. తనకు నచ్చిన విధంగా సెక్సీ పోజులిస్తూ నెటిజన్లకి ఫుల్ మీల్స్ ని పెడుతుంటుంది. తాజాగా మరోసారి ఈ అందాల భామ రెచ్చిపోయింది. అయితే అందులో కాస్త వెరైటీగా ఆకట్టుకుంటుండటం విశేషం.
జాన్వీ.. `ది కలెక్టీవ్` అనే లగ్జరీ కలెక్షన్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ షోరూమ్ ఓపెనింగ్‌లో పాల్గొంది. గ్రీన్ మ్యాక్సీ డ్రెస్‌లో హోయలు పోయింది. స్టన్నింగ్ లుక్‌లో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఎప్పుడూ తన అందాలను ఓపెన్‌గా చూపించే ఈ భామ ఈ సారి మాత్రం కాస్త పొదుపు పాటించింది. డ్రెస్‌లో అందాలు బంధించింది. కానీ హాట్‌నెస్ మాత్రం తగ్గేదెలే అన్నట్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు.
ఎప్పటి మాదిరిగానే జాన్వీకపూర్‌ని ఇలా చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జాన్వీ ఎలా కనిపించినా హాట్‌గానే ఉంటుందని, సెక్సీనెస్, హాట్‌నెస్ ఆమె బాడీలోనే కాదు చూపుల్లోనూ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. జాన్వీ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అతిలోక సుందరి ఈవెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ జనాలకు మంచి కిక్క్ ని ఇచ్చే కథానాయికల్లో జాన్వీ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ అందాల భామ ఒక్క హాట్ ఫోటో షేర్ చేసిందంటే చాలు మిలియన్స్ లో వ్యూస్ వచ్చిపడుతుంటాయి. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేకుండా దూసుకుపోతున్న ఈ భామని నెటిజన్లు సైతం అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇంటర్నెట్‌లో హాట్ బాంబ్‌గా మారిన జాన్వీ కపూర్ కుర్రాళ్లకి డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఆమె అందాల ఫోటోల కోసమే కుర్రాళ్ల ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఓ రకంగా తన గ్లామర్ పోజులతో యూత్‌కి వ్యసనంలా తయారైపోయింది శ్రీదేవి తనయ. వారంలో ఒక్కరోజైనా జాన్వీ ఫోటోలు రాలేదంటే పిచ్చోళ్లైపోతారనేలా తయారు చేసిందీ ముద్దుగుమ్మ.
`దడక్` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది జాన్వీ కపూర్. మరాఠి చిత్రం `సైరత్`కిది రీమేక్. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేసింది. అయితే శ్రీదేవి తన కూతురు తొలి సినిమాని చూసుకోలేకపోవడం బాధాకరం. ఆమె దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
తల్లి మరణంతో జాన్వీ ఫ్యామిలీకి పెద్ద లోటు. కానీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సమక్షంలో కెరీర్‌ని ఉన్నతంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. `ఘోస్ట్ స్టోరీస్`, `గుంజన్ సక్సేనా`, `రూహి` చిత్రాలతో ఆకట్టుకుంది. నటిగా తనకంటూ మంచి పేరును తెచ్చుకుంది. గ్లామర్‌గానే కాదు, నటిగా తాను ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తుంది జాన్వీ.
ప్రస్తుతం `గుడ్‌లక్ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వరుణ్ దావన్‌తో `బవాల్` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. జాన్వీ నటించబోతున్న తొలి భారీ చిత్రమిది. అంతేకాదు ఫస్ట్ టైమ్ ఓ స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం ఆమెని వరించింది.మరోవైపు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ జాన్వీ పేరు వినిపిస్తుంది.