- Home
- Entertainment
- సీక్రెట్‌గా లవర్‌ని మెయింటేన్ చేసిన `జబర్దస్త్` వర్ష.. అసలు విషయం బయటపడటంతో నోరెళ్లబెట్టిన ఇమ్మాన్యుయెల్
సీక్రెట్‌గా లవర్‌ని మెయింటేన్ చేసిన `జబర్దస్త్` వర్ష.. అసలు విషయం బయటపడటంతో నోరెళ్లబెట్టిన ఇమ్మాన్యుయెల్
`జబర్ధస్త్` వర్షకి ఆల్‌రెడీ లవర్ ఉన్నాడా? తాజాగా అసలు విషయం బయటపడింది. ఫస్ట్ నైట్ రోజే తన మాజీ ప్రియుడిని తలుచుకుంది వర్ష. దీంతో ఇమ్మాన్యుయెల్ ముందు అడ్డంగా దొరికిపోయింది.

తెలుగు కామెడీ షోస్‌లో `జబర్దస్త్` చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అత్యధిక రేటింగ్‌తో దూసుకుపోతుంది. అయితే ఇందులో యాంకర్ రష్మి, సుడిగాలిసుధీర్ జోడి ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్, వర్ష జోడి మధ్య కెమిస్ట్రీ అదే స్థాయిలో పండటంతో హైలైట్‌గా నిలుస్తుంది. వీరిద్దరు కలిసి స్కిట్లు చేస్తుండటంతో మరింతగా షో మరింతగా రక్తికడుతుంది.
అయితే చాలా రోజులుగా వర్ష, ఇమ్మాన్యుయెల్ లవర్స్ గా స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలను పంచుకునే సమయంలోనే ఇమ్మాన్యుయెల్‌ని లేకుండా తన లైఫ్‌ని ఊహించుకోలేనని చాలా సందర్భాల్లో చెప్పింది. ఇమ్మాన్యుయెల్ లేకపోతే చాలా కష్టం అంటూ రియాక్ట్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ సాగుతుందనే అంచనాని షోలోని మెంబర్‌తోపాటు ఆడియెన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.
యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ మాదిరిగానే వర్ష, ఇమ్మాన్యుయెల్‌ని కలిపి చూస్తున్నారు. వీరిద్దరు వేరే వారితో స్కిట్లు చేసినా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అభిమానులు. కలిసి చేయాలని రిక్వెస్ట్ చేయడంగానీ, లేదంటే ట్రోల్స్ చేయడంగానీ చేస్తున్నారు. దీంతో కొంత కాలం జబర్దస్త్ షోకి కూడా దూరంగా ఉంది వర్ష. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఇమ్మాన్యుయెల్‌తో స్కిట్లు చేస్తూ దూసుకుపోతుంది.
యాంకర్‌గా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు `జబర్దస్త్` కమెడీయన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న `జబర్దస్త్` వర్ష.. ఇమ్మాన్యుయెల్‌కి పెద్ద షాకిచ్చింది. తనకుముందే ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో బలవంతంగా ఇమ్మాన్యుయెల్‌ని బలవంతంగానూ పెళ్లి చేసుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఇమ్మాన్యుయెల్, వర్ష పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకోవడానికి సిద్ధమవుతారు. వర్షని ఇమ్మాన్యుయెల్ టచ్ చేయగానే ప్రభా అంటూ వర్ష అరవడంతో ఇమ్మూ షాక్‌కి గురయ్యాడు. అంతకు ముందే ఆమెకి ఓ ప్రియుడు ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఆమె మనసులో స్థానం సంపాదించుకున్న తర్వాతే ఫస్ట్ నైట్ అంటూ ఆ రోజుని క్యాన్సిల్ చేసుకున్నారు. సేమ్ ఇలాంటి పరిస్థితే ఫైమా విషయంలో భాస్కర్‌కి ఎదురవుతుంది. ఇద్దరు కలిసి తమ ఫస్ట్ నైట్‌లు పూర్తయినట్టు కవర్ చేసుకోవడం నవ్వులు పూయించింది.
ఇది `ఎక్స్ ట్రా జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోలోని ఇమ్మాన్యుయెల్-భాస్కర్‌ల స్కిట్ సన్నివేశాలు. తాజాగా విడుదలైన ఈ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. విశేషంగా ఆకట్టుకుంటుంది. శుక్రవారం ఈ ఎపిసోడ్ ప్రసారంకానుండగా, అందులో ఈ స్కిట్ నవ్వులు పూయించేదిగా ఉండబోతుందని అర్థమవుతుంది.