MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • `స్పై` ఫెయిల్యూర్‌పై ఐశ్వర్య మీనన్‌ రియాక్షన్‌.. `భజే వాయు వేగం` హీరోయిన్‌గా నిలబెడుతుందా?

`స్పై` ఫెయిల్యూర్‌పై ఐశ్వర్య మీనన్‌ రియాక్షన్‌.. `భజే వాయు వేగం` హీరోయిన్‌గా నిలబెడుతుందా?

ఐశ్వర్య మీనన్‌ `స్పై` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంలో నటిస్తుంది. తాజాగా `స్పై` ఫెయిల్యూర్‌పై ఆమె రియాక్ట్ అయ్యింది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : May 27 2024, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`స్పై` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్‌. ఇందులో గ్లామర్‌గానే కాదు యాక్షన్‌తోనూ మెప్పించింది. ట్విస్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసింది. కానీ సినిమా తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్‌పై స్పందించింది ఐశ్వర్య. సినిమా బాగుందనే చేశామని, కానీ ఫలితం మన చేతుల్లో ఉండదని చెప్పింది. `ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. `స్పై` సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు` అని తెలిపింది ఐశ్వర్య మీనన్.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఐశ్వర్య మీనన్‌ తెలుగులో మరో సినిమాతో రాబోతుంది. కార్తికేయతో కలిసి `భజే వాయు వేగం` చిత్రంలో నటించింది. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 31న సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో సోమవారం ఐశ్వర్య మీనన్‌ మీడియాతో ముచ్చటించింది. ఇందులో ఆమె మాట్లాడుతూ ``భజే వాయు వేగం` సినిమాలో ఇందు అనే క్యారెక్టర్ చేశాను. ఆమె బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే సహజంగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు వెంకట్. ఆయన పర్సెప్షన్ లోనే సినిమా అంతా వెళ్తుంది. కథలో నేను కీలకమైన పాత్రగా ఉంటాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు.  వెంకట్ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అంతగా అతన్ని ఇష్టపడుతుంది. 
 

37
Iswarya Menon

Iswarya Menon

`భజే వాయు వేగం` ఒక రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం ఇష్టం పైగా యూవీ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించింది. సో ఆఫర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సినిమా చీరకట్టు లేదా  ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతుంటా. 

47

``స్పై` సినిమా తర్వాత నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎంపికగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటా వచ్చా. తెలుగులోనే కాదు తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ఇతర పరిశ్రమల్లో ఎగ్జైటింగ్ ప్రాజెక్స్ట్ వచ్చినప్పుడు నో చెప్పలేం కదా. మలయాళంలో మమ్ముట్టి గారితో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అలాంటి లెజెండ్ తో కలిసి నటించే అవకాశం ప్రతిసారీ దక్కకపోవచ్చు. `స్పై` సినిమాలో మోడరన్ డ్రెసెస్, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశా. "భజే వాయు వేగం" సినిమాలో నా పాత్ర స్పై సినిమాలోని క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది` అని తెలిపింది ఐశ్వర్య మీనన్‌. 
 

57

`భజే వాయు వేగం` సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే లవ్ రొమాన్స్ పార్ట్ తక్కువగానే ఉంటుంది.  డబ్బు నేపథ్యంగా కథ ఉంటుందా అనేది తెరపైనే చూడాలి. ఆ ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయి. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన నటించిన `ఆర్ఎక్స్ 100` సినిమా చూశాను. కార్తికేయతో సినిమా చేయాలని ఉండేది. అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు` అని చెప్పింది ఐశ్వర్య.
 

67

ఇక తనకు ఐటెమ్‌ సాంగ్స్ చేయాలని ఉందట.. `నేను భరతనాట్యం డ్యాన్సర్ ను. మంచి డ్యాన్స్ నెంబర్స్ చేయాలనే కోరిక ఉంది. డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడతా. ఇప్పటిదాకా మంచి డాన్స్ నెంబర్ నాకు దక్కలేదు. అలాంటి ఆఫర్లని కోరుకుంటున్నాను. అలాగే పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కమర్షియల్ సినిమా హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమూ ముఖ్యమనే భావిస్తా. అదే సమయంలో అందరు హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది` అని చెప్పింది ఐశ్వర్య. ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నట్టు, తెలుగులో ఓ మూవీకి సైన్‌ చేశానని, మరో రెండు మూవీస్‌కి చర్చలు జరుగుతున్నాయని తెలిపింది ఐశ్వర్య మీనన్‌. 
 

77

ఇక తన బ్యాక్‌ గ్రౌండ్, సినిమాల్లోకి రావడం గురించి చెబుతూ, `తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న టౌన్ మాది. మధ్య తరగతి కుటుంబం. మా బ్రదర్ డాక్టర్. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్ లో చదువుకుంటున్న టైమ్ లోనే నేను బాగా పాపులర్. కమర్షియల్ యాడ్స్ లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పూర్తిగా నటన మీద ఫోకస్ చేశాను. నేను పరిశ్రమలో తెచ్చుకున్న గుర్తింపునకు గర్వంగా ఉంది. ఇదంతా నాకు నేనుగా సొంతంగా తెచ్చుకున్న పేరు. ప్రేక్షకుల అభిమానం పొందడం అనేది ఏ ఆర్టిస్టుకైనా ముఖ్యం. ఆఫర్స్, సక్సెస్ తర్వాత ముందు ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ ఉంటే ఇక్కడ కెరీర్ బాగుంటుంది. ఆ ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా` అని వెల్లడించింది ఐశ్వర్య మీనన్.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved