MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • #GameChanger:నత్తి తో ఇబ్బందిపడే రామ్ చరణ్, ఇంట్రస్టింగ్ ఇన్ఫో

#GameChanger:నత్తి తో ఇబ్బందిపడే రామ్ చరణ్, ఇంట్రస్టింగ్ ఇన్ఫో

 నత్తి కావాలని పెట్టినట్లు కాకుండా కథలో కొన్ని కీలకమైన సంఘటనలకు నత్తి దోహదం చేస్తుందని అంటున్నారు. అంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసారని అంటున్నారు.   

3 Min read
Author : Surya Prakash
Published : May 28 2024, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


సినిమా తీరు మారింది. క్యారక్టర్స్ రియలిస్టిక్ గా ఉండేలా దర్శకులు చూసుకుంటున్నారు. లేకపోతే జనం పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఒక సినిమా చేయాలి అంటే దానికి ఒక కథతో విభిన్నమైన పాత్రలు కావాలి. పాత్రకు తగ్గట్టు నటీనటులు ఎంపిక చేయాలి.అలా ఒక్క సినిమా విషయంలో  ప్రతి ఒక్క చిన్న దానిని పెద్దగా చూస్తున్నారు దర్శకులు..
అప్పుడే కథకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో హీరోకు ఏదైనా ఒక సమస్య పెడితే మరింతగా జనాల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. ఆ మద్యన రంగస్దలంలో రామ్ చరణ్ చెవుడు సమస్యతో ఇబ్బంది పడుతూంటాడు. అలాగే ఇప్పుడు ఆయన కొత్త చిత్రం లో నత్తితో ఇబ్బంది పడేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కీ నత్తి పెట్టారు శంక‌ర్‌. అయితే ఆ నత్తి కోపం వచ్చినప్పుడు మరింతగా పెరుగుతుందిట. ఈ క్రమంలో హీరో సైలెంట్ గా ఉంటాడని ఎక్కువ మాట్లాడరని చెప్తున్నారు. అయితే ఈ నత్తి పాత్రను సినిమా అంతా కనిపించదు అని చెప్తున్నారు. ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఈ నత్తి పాత్ర కనపడుతుందిట. 
 

310


ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ది ద్విపాత్రాభిన‌యం. తండ్రీ కొడుకులుగా కనిపించనున్నాడు. తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వ‌స్తుంది. ఆ పాత్ర‌కే న‌త్తిని పెట్టాడు. ప్లాష్ బ్యాక్ సాగే పావు గంటసేపు ఈ నత్తి పాత్ర కనపడబోతోందని తెలుస్తోంది. అలాగే నత్తి కావాలని పెట్టినట్లు కాకుండా కథలో కొన్ని కీలకమైన సంఘటనలకు నత్తి దోహదం చేస్తుందని అంటున్నారు. అంత జాగ్రత్తగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసారని అంటున్నారు.   

410


ఇంతకు ముందు ఇలాంటి నత్తి పాత్రలో ఎన్టీఆర్ లవకుశ చిత్రంలో కనిపించారు. అలాగే   ‘లైగ‌ర్‌’లో కూడా  విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు న‌త్తి. ఆ సినిమా ఫ్లాప్ కు అదో కారణంగా చెప్పుకొచ్చారు. అయితే లవకుశలో ఎన్టీఆర్ పాత్ర బాగా క్లిక్ అయ్యింది.    దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్3. ఇందులో వరుణ్ కు నత్తిగా చూపించాడు డైరెక్టర్. ఆ సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది. 
 

510
game changer

game changer


ఇక రామ్ చరణ్ గత మూడేళ్ళుగా ఆపకుండా కంటిన్యూగా  చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది..ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయమై క్లారిటీ లేకుండా పోయింది.  దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. 

610


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు సమాచారం. లాంగ్ వీకెండ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసి నిర్మాత దిల్ రాజు ఆ డేట్ కన్ఫమ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ సైతం క్రిస్మస్ శెలవులను ఫెరఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అదే రూట్ లో రాబోతోంది.   

710


 ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.
 

810

  చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు.

910


అలాగే అప్పట్లో శంకర్ గతంలో తీసిన “ఒకే ఒక్కడు” చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందిట. కార్తీక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథ కొత్తగా ఉండటమే కాకుండా మంచి మెసేజ్ ని మోసుకు వస్తుందంటున్నారు.  ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామికవాదులను, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకు బాగా నచ్చే అవకాసం ఉంది.
 

1010


  రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved