- Home
- Entertainment
- Mahesh Babu: రాఘవేంద్రరావు స్ఫూర్తితో రాజమౌళి, మహేష్ చిత్రం.. ఇప్పుడు కొత్తగా, భారీగా..
Mahesh Babu: రాఘవేంద్రరావు స్ఫూర్తితో రాజమౌళి, మహేష్ చిత్రం.. ఇప్పుడు కొత్తగా, భారీగా..
ఆర్ఆర్ఆర్ రిలీజై ఘనవిజయం సాధించింది. దీనితో ఇప్పుడు రాజమౌళి ఫోకస్ మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై పడింది. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇద్దరూ మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ ఫినిషి చేసే పనిలో ఉన్నారు.

Mahesh Babu
ఆర్ఆర్ఆర్ రిలీజై ఘనవిజయం సాధించింది. దీనితో ఇప్పుడు రాజమౌళి ఫోకస్ మొత్తం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై పడింది. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇద్దరూ మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ ఫినిషి చేసే పనిలో ఉన్నారు. మహేష్ బాబు కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారు.. ఎంత బడ్జెట్.. ఇలాంటి ఆసక్తికర చర్చ అభిమానుల్లో మొదలయింది.
Mahesh Babu
మహేష్, రాజమౌళి తొలి కలయికలో రాబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ కూడా తాను ఈ స్టోరీ లైన్ పైనే వర్క్ చేస్తున్నట్లు.. మరికొన్ని ప్రత్యామ్నాయ కథలు కూడా ఉన్నట్లు తెలిపారు.
Mahesh Babu
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో సినిమా చేయాలనేది రాజమౌళి కోరిక. రాజమౌళికి జంతువుల విజువల్స్ చూపించడం చాలా ఇష్టం అట. అందుకే యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్, చిరుతతో పోల్చుతూ ఒక సీన్ పెట్టారు. బాహుబలిలో రానా.. దున్నని చంపడం.. బాహుబలి పార్ట్ 2లో ఎద్దుల సన్నివేశం లాంటివి పెట్టారు. ఇక ఆర్ఆర్ఆర్ లో జంతువులతో ఫైట్స్ ఉన్నాయి.
Mahesh Babu
అదే అడవి నేపథ్యంలో కంప్లీట్ గా జంతువులని ఇన్వాల్వ్ చేస్తూ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రాజమౌళికి చాలా కాలం నుంచి ఉంది. తన జంగిల్ బ్యాక్ డ్రాప్ కథకి ఎన్టీఆర్ అడవి రాముడు చిత్రం స్ఫూర్తి అని తెలుస్తోంది. ఇంత టెక్నాలజీ, స్టూడియోస్ లేని రోజుల్లోనే రాఘవేంద్ర రావు ఆ చిత్రాన్ని ఫారెస్ట్ లో షూట్ చేశారు. అడవుల నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాల్లో అడవి రాముడు ఇప్పటికి ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి.
mahesh babu
మహేష్ సినిమా విషయంలో తన గురువుని ఫాలో కావాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇండియాలో రియల్ యానిమల్స్ ని షూటింగ్స్ లో చూపించడం నిషేధం. అందుకోసం ఆఫ్రికా వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారట. అక్కడ అడవులు కూడా బాగా దట్టంగా ఉంటాయి. వేలల్లో జంతువులు సంచరిస్తూ ఉంటాయి. ఆ విజువల్స్, లొకేషన్స్ మహేష్ చిత్రాన్ని బావుంటాయని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో రాజమౌళినే క్లారిటీ ఇవ్వాలి. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే త్రివిక్రమ్ తో సినిమాకి కూడా మహేష్ కమిట్ అయి ఉన్నారు. రాజమౌళి స్క్రిప్ట్ రెడీ చేసే లోపు త్రివిక్రమ్ మూవీ ఫినిష్ చేయాలని మహేష్ భావిస్తున్నాడు.