- Home
- Entertainment
- హాట్ కేక్‌లా ఊరిస్తున్న ఇలియానా అందాలు.. క్లోజప్ షాట్‌లో కైపెక్కిస్తున్న గోవా బ్యూటీ
హాట్ కేక్‌లా ఊరిస్తున్న ఇలియానా అందాలు.. క్లోజప్ షాట్‌లో కైపెక్కిస్తున్న గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తుంది. కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టుకునేందుకు నానా తిప్పలు పడుతుంది. అభిమానులకు మాత్రం అన్‌లిమిటెడ్ అందాల విందుని వడ్డిస్తుంది.

సన్నజాజి నడుముతో కుర్రాళ్ల లోకాన్ని ఊపేసిన హాట్ బాంబ్ ఇలియానా(Ileana). తీగలాంటి నడుముతో టాలీవుడ్ మొత్తాన్ని తన చుట్టూ తిప్పేసుకుంది. దశాబ్దంపాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఉర్రూతలూగించింది. తాజాగా ఈ అమ్మడి కెరీర్ గతుకుల రోడ్డులా సాగుతుంది. అస్సలు కదలడం లేదు. ఏం చేసినా మేకర్స్ పట్టించుకోవడం లేదు.
దీంతో తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది Ileana. హాట్ ఫోటోలను గ్యాప్ లేకుండా పంచుకుంటూ అందాల విందుని వడ్డిస్తుంది. లేటెస్ట్ గా ఆమె ఓ క్లోజప్ షాట్‌ని పంచుకుంది. ఇది నా జిమ్మి అంటూ సమ్ కేక్ ఫేస్ అంటూ ఓ సెక్సీ పిక్‌ని పంచుకుంది ఇలియానా. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హాట్ కేక్‌లా ఊరిస్తుందంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. Ileana Hot Photos.
ఇలియానా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. ఇన్నోసెంట్ యాక్టింగ్, పిచ్చెక్కించే పోజులు, మతిపోగొట్టే కొలతలు ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేశాయి. ఒకానొక దశలో అనేక ఇతర హీరోయిన్లని డామినేట్ చేసింది ఇలియానా. యంగ్ హీరోల నుంచి టాప్ స్టార్స్ వరకు ఇలియానే హీరోయిన్ కావాలనుకునేంత క్రేజ్ ఆమె సొంతం.
ఒక పదేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఊపేసింది ఇలియానా. అత్యంత స్టార్‌డమ్‌తో నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది. పారితోషికం పరంగానూ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా నిలిచింది. ఆడియెన్స్ ఆద్యంతం అలరించింది.
`దేవదాస్`, `పోకిరి`, `జల్సా`, `రాఖీ`, `కిక్`, `జులాయి` వంటి చిత్రాల్లో ఇలియానా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇన్నోసెంట్ యాక్టింగ్‌తో హీరోలతో పోటీ పడీ చేసింది. కొన్ని చిత్రాల్లో అయితే ఇలియానే హైలైట్‌గా నిలవడం విశేషం.
ఇలియానా నటిగానూ మంచి పేరుతెచ్చుకుంది. కేవలం స్టార్ హీరోల సరసన అలా వచ్చి ఇలా పోయే పాత్రలు మాత్రం కాదు, నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేసింది. అందుకే ఆమె ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యింది. అయితే ఆమె సన్నని నడుము మాత్రం చాలా ఫేమస్ అని చెప్పక తప్పదు.
అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా ప్రేమలో పడింది. డేటింగ్ కారణంగా ఆమె కెరీర్‌ని లైట్ తీసుకుంది. తర్వాత ప్రియుడితో బ్రేకప్ జరగడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే అది అంత ఈజీగా జరగలేదు. డిప్రెషన్ ఎదుర్కొంది. బరువు పెరిగి విమర్శలెదుర్కొంది. ట్రోల్స్, మీమ్స్ ఆమెని బాగా ఇబ్బంది పెట్టాయి. బాడీపై వచ్చిన కామెంట్లకి ఆమె చాలా మానసికంగా కుంగిపోయింది.
నెమ్మదిగా దాన్నుంచి బయటపడి కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. నెమ్మదిగా మళ్లీ పుంజుకోవాలని, కెరీర్‌ని గాడీలో పెట్టుకోవాలని భవిస్తుంది. కానీ సరైన ఆఫర్లు రావడం లేదు. ఒకటి అర తప్ప పెద్దగా ఛాన్స్ లు రాకపోవడం విచారకరం. అయినా తనవంతు ప్రయత్నం గట్టిగానే చేసింది. అందాల ఆరబోతతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ఇలియానా. మరి ఆమెకి మున్ముందైనా మంచి పాత్రలొస్తాయేమో చూడాలి.