MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్కరోజైనా మగాడిలా బ్రతకాలని ఉంది... హీరోయిన్ త్రిషలో వింత కోరికలు, కారణం?

ఒక్కరోజైనా మగాడిలా బ్రతకాలని ఉంది... హీరోయిన్ త్రిషలో వింత కోరికలు, కారణం?

స్టార్ లేడీ త్రిష మగాడిగా మరలనుకుంటుదట. ఆమె వింత కోరిక విన్న ఫ్యాన్స్ అవాక్కు అవుతున్నారు. పెళ్లి మాట ఎత్తని ఈ 41 చెన్నై భామ జెండర్ మార్చుకుంటుందా? ఏమిటనే చర్చ మొదలైంది..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 29 2024, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Trisha Krishnan

Trisha Krishnan

దాదాపు 25 ఏళ్ళుగా సిల్వర్ స్క్రీన్ ని ఏలుతోంది త్రిష. 1999లో విడుదలైన జోడి మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్ చేసిన త్రిష 2002లో విడుదలైన మౌనం పెసియదే చిత్రంతో హీరోయిన్ గా మారింది. అద్భుతమైన నటనతో వరుస ఆఫర్స్ అందుకుంది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగులో వర్షం త్రిషకు బ్రేక్ ఇచ్చింది. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన వర్షం సూపర్ హిట్. ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, కృష్ణ వంటి హిట్ చిత్రాలతో ఆమె తెలుగులో స్టార్ గా నిలదొక్కుకుంది. అటు తమిళ్ లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. 

37

కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమైన త్రిష ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఫేడ్ అవుట్ దశలో కూడా ఆమెకు స్టార్స్ పక్కన ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది లియో మూవీలో విజయ్ తో జతకట్టింది. ఇప్పుడు త్రిష చేతిలో ఉన్న చిత్రాలన్నీ స్టార్ హీరోలవే. 

 

47

అజిత్, మోహన్ లాల్, కమల్ హాసన్ చిత్రాల్లో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష జతకడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరలో త్రిష ప్రధాన హీరోయిన్ పాత్ర చేస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. 

57
Actress Trisha Krishnan

Actress Trisha Krishnan

వృత్తిపరంగా దూసుకుపోతున్న త్రిష వ్యక్తిగత జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి.ఆమె పలువురు నటులతో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. ఈ లిస్ట్ లో రానా, శింబు లాంటి నటులు ఉన్నారు. 2015లో చెన్నై కి చెందిన వరుణ్ మణియన్ అనే బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ పెళ్లిని త్రిష రద్దు చేసుకుంది. 

67

41 ఏళ్ల త్రిష పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే తనకు పురుషుడిగా మారాలని ఉందని వింత కోరిక బయటపెట్టింది. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ కనీసం ఒక్కరోజైనా మగాడిగా ఉండాలని నా కోరిక అన్నారు. త్రిష మాటలు విన్న నెటిజెన్స్.. ఈమె జెండర్ మార్చుకుంటారేమో? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 

77

అబ్బాయిగా మారాలన్న ఆమె కోరిక వెనకున్న రీజన్ ఏమిటో తెలియదు. అంతా అనుకున్నట్లు 2015లో త్రిషకు వివాహం జరిగితే తల్లి కూడా అయ్యేవారు. ప్రస్తుతం అరడజను సినిమాల వరకు త్రిష చేతిలో ఉన్నాయి. విడా ముయార్చి, రామ్, ఐడెంటిటీ, థగ్ లైఫ్, విశ్వంభర చిత్రాల్లో త్రిష నటిస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
త్రిష
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved