హీరోయిన్ తాప్సీ టీనేజ్ లవ్ స్టోరీ, స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడ్డ బ్యూటీ..
టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి.. బాలీవుడ్ కు చేరింది తాప్సీ పన్ను. ఆతరువాత సౌత్ మఖం చూడకుండా.. బీ టౌన్ లోనే కంటీన్యూ అవుతుంది. కాస్త కాంట్రవర్షియల్ హీరోయిన్ గా పేరున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతంది. అటు హీరోయిన్ గా నటిస్తూనే..ఇటులేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా దుమ్ము రేపుతోంది.

A Software Engineer
కంగనాతరువాత కాంట్రవర్షియల్ హీరోయిన్ గా పేరు సాధించింది తాప్సీపన్ను. తాజాగా షారుఖ్ ఖాన్ హరోగా నటించిన డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి డైరెక్ట్ చేసిన ఈమూవీ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు టీమ్.
No Film Background
డంకీ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా మారిపోయింది తాప్సీ. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్తోంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషాయాలు పంచుకుంది. ఆమె తన మొదటి ప్రేమ గురించి మనసులో మాట బయట పెట్టింది. ఫస్ట్ లవ్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ తో శేర్ చేసుకుంది బ్యూటీ. ఇంతకీ ఆమె ఏంటుందంటే..?
తాను స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడ్డానని చెప్పారు తాప్సీ. తను 9th క్లాస్ చదువుతున్న సమయంలోనే 10th క్లాస్ అబ్బాయితో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే మా రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగలేదని ఈమె తన తొలి ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ఎంతగానో ప్రేమించినా.. అతను మాత్రం మధ్యలోనే డ్రాప్అయ్యాడన్నారుతాప్సీ.
ఇప్పుడంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి.. రకరకాల మార్గాలు ఉన్నాయి. కాని అప్పట్లో అవి ఏమీ లేవు దాంతో మా ఇంటి దగ్గరలో ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి తనతో మాట్లాడేదాన్ని. కాని ఓ సారి టెలీపోన్ బూతు నుంచి ఆ అబ్బాయికి ఫోన్ చేశాను కానీ తను మాత్రం నా ప్రేమను మర్చిపోమని తాను చదువు పై దృష్టి పెట్టానని చెప్పారు. అని తన తోలి ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్నారు తాప్సీ.
ఇలా నా తొలిప్రేమ ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని ఆరోజు ఆ అబ్బాయి అలా మాట్లాడటంతో నేను ఎంతో ఏడ్చాను అని అన్నారు తాప్సీ. ఈ సందర్భంగా మరిన్ని విసయాలు మీడియాతో మాట్లాడుతూ.. గుర్తు చేసుకున్నారు. ఇక తన జ్ఞాపకాల నుంచి నేను బయటపడటానికి కొన్ని నెలల సమయం పట్టింది అంటూ బాధపడ్డారు.
అంతే కాదు ప్రేమ గురించి తాప్పీ చెప్పిన మాటలు అందరిని ఇంప్రెస్ చేస్తున్నాయి. తనకు ఆ తొలిప్రేమ ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే అంటూ అప్పటి విషయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాప్సీ ఓ ఫారెనర్ తో ప్రమలో ఉంది. ఇద్దరు కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడుప్పుడు ఇద్దరు జంటగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు.