Samantha: సడన్ గా సమంతకు ఏమైంది? ఆందోళనలో ఫ్యాన్స్!
సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. ఆమె ఆక్సిజన్ మాస్క్ తో కనిపించారు. దీంతో సమంతకు ఏమైందని కంగారు పడుతున్నారు.
Samantha
సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ నెలలో సమంత హెల్త్ ప్రాబ్లమ్ బయటపెట్టారు. యశోద చిత్రానికి ఇంట్లోనే ఉండి డబ్బింగ్ చెప్పారు. ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. కేవలం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు నాలుగు నెలలు సమంత బయట కనిపించలేదు. సమంత చికిత్స తీసుకున్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gz0f0yw63q8zrgyvcnsedxck/343922989-592951549456671-5261220582193881644-n-jpg_300x375xt.jpg)
Samantha
గత మూడు నెలలుగా సమంత యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తిరిగి షూటింగ్స్ స్టార్ట్ చేశారు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సమంత శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇంకా పూర్తిగా కోలుకోలేదన్నట్లు మాట్లాడారు. అలసట, నీరసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని అందుకే గ్లాసెస్ పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు.
Samantha
ఈ క్రమంలో సమంత సడన్ గా ఆక్సిజన్ మాస్క్ తో కనిపించడం షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైందనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె నెక్స్ట్ ఫోటో చూశాక క్లారిటీ వచ్చింది. సమంత ఆ మాస్క్ పెట్టుకుంది హైపర్బేరిక్ థెరపీ కోసం అట. దీని ప్రయోజనాలు ఏమిటో ఆమె పోస్ట్ చేశారు.
Samantha
హైపర్బేరిక్ థెరఫీ కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పాడైన కండరాలను బాగుచేస్తుందని సమంత వెల్లడించారు. మయోసైటిస్ సోకిన నేపథ్యంలో సమంత హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నారని అర్థం అవుతుంది. విషయం తెలిశాక సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సమంత ఆరోగ్యం మీద నిర్మాత చిట్టిబాబు విమర్శలు చేశారు. సమంత నటిస్తుంది. ఆమె ఆరోగ్యం పాడైన విషయం అబద్ధం. మయోసైటిస్ సాధారణ వ్యాధే. అందరికీ వచ్చేదే. సమంత సింపతీ కోసం రాద్ధాంతం చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. చిట్టిబాబు తనపై చేసిన ఆరోపణలకు సమంత పరోక్షంగా సమాధానం చెప్పారు. ఆయన చెవులపై ఉన్న వెంట్రుకలను ఉద్దేశిస్తూ ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
ఇక సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.