- Home
- Entertainment
- Rakul Preeth: టాపు లేపిన రకుల్ ప్రీత్.. స్కర్ట్ కి జాకెట్ కి గ్యాప్ ఇచ్చి టెంపరేచర్ పెంచేస్తున్న బోల్డ్ బ్యూటీ
Rakul Preeth: టాపు లేపిన రకుల్ ప్రీత్.. స్కర్ట్ కి జాకెట్ కి గ్యాప్ ఇచ్చి టెంపరేచర్ పెంచేస్తున్న బోల్డ్ బ్యూటీ
రకుల్ వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ తడిసి ముద్దవుతున్నారు. వేసవి దాహంతో అల్లాడుతున్న జనాలను తన అందాల జడిలో ముంచేస్తుంది. రకుల్ ట్రెండీ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా మెరూన్ కలర్ టాప్,స్కర్ట్ ధరించి సెక్సీ ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. రకుల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Rakul Preeth Singh
రకుల్ లేటెస్ట్ మూవీ రన్ వే 34(Runway 34). ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రకుల్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రన్ వే మూవీలో రకుల్ పైలట్ తాన్యా అనే రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Rakul Preeth Singh
నెలల వ్యవధిలో వరుసగా రకుల్ నటించిన బాలీవుడ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ప్రొఫెషనల్ గా సక్సెస్ ఫుల్ ట్రాక్ లో వెళుతున్న రకుల్ పర్సనల్ లైఫ్ లోకూడా కంఫర్ట్ గా ఉన్నారు. యాక్టర్ కం ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తన ప్రేమికుడు అని కన్ఫర్మ్ చేసింది. రకుల్ ప్రీత్ చెప్పే వరకు వీళ్ళ రిలేషన్ గురించి అసలు సమాచారం లేదు. మీడియాలో ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించిన కథనాలు వెలువడలేదు. ఇది ఒకింత ఆమె అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పాలి.
Rakul Preeth Singh
గత ఏడాది అక్టోబర్ లో బర్త్ డే జరుపుకున్న రకుల్ (Rakul Preeth Singh)బేబీ తన లవర్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. ఇతనే నా లవ్ అంటూ... సడన్ షాక్ ఇచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్. రకుల్ పై గతంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జాకీ పేరు కొత్తగా వినిపించడంతో అందరూ ఒకింత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు.
Rakul Preeth Singh
కాగా ఈ మధ్య రకుల్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడంటూ మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు. పదేపదే అదే ప్రశ్నఅడగడంతో విసిగిపోయిన రకుల్ ప్రీత్ ఇటీవల ఫైర్ అయ్యారు. జీవితంలో పెళ్లి తప్ప ఇంపార్టెంట్ విషయం ఇంకేమీ ఉండదా.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానంటూ ఘాటుగా స్పందించింది.
Rakul Preeth Singh
ఇక బాలీవుడ్ లో రకుల్ థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రీవాలి, మిషన్ సిండ్రెల్లా అనే హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు మూడు చిత్రాలు చేస్తున్నారు. సౌత్ టు నార్త్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ కెరీర్ రేసు గుర్రం రీతిలో దూసుకుపోతుంది.
Rakul Preeth Singh
కాగా రకుల్ తెలుగులో నటించిన లేటెస్ట్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొండ పొలం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీ దారుణ పరాజయం ఎదుర్కొంది. అంతకు ముందు విడుదలైన చెక్ మూవీ సైతం డిజాస్టర్స్ ఖాతాలో చేరింది.దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి.కావున స్టార్ పక్కన ఛాన్స్ రావడం ఇక కష్టమే.
Rakul Preeth Singh
మరోవైపు డ్రగ్స్ ఆరోపణలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు రకుల్ విచారణ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్ లను నార్కోటిక్ అధికారులు విచారించారు. వారితో పాటు రకుల్ కూడా హాజరయ్యారు.
Rakul Preeth Singh
రకుల్ వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ తడిసి ముద్దవుతున్నారు. వేసవి దాహంతో అల్లాడుతున్న జనాలను తన అందాల జడిలో ముంచేస్తుంది. రకుల్ ట్రెండీ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా మెరూన్ కలర్ టాప్,స్కర్ట్ ధరించి సెక్సీ ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. రకుల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.