Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నీ సినిమాకి థియేటర్స్ ఇవ్వం అంటూ నిఖిల్ కి బెదిరింపులు.. కన్నీరు పెట్టుకున్న హీరో, ఎమోషనల్ కామెంట్స్

నీ సినిమాకి థియేటర్స్ ఇవ్వం అంటూ నిఖిల్ కి బెదిరింపులు.. కన్నీరు పెట్టుకున్న హీరో, ఎమోషనల్ కామెంట్స్

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. 

team telugu | Published : Jul 31 2022, 05:55 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Karthikeya 2

Karthikeya 2

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.  నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. 

26
Karthikeya 2

Karthikeya 2

ఎందుకంటే ఈ చిత్రం కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కొనసాగుతోంది. దేవుడితో లింక్ పెడుతూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కార్తికేయ విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఆగష్టు 12న కార్తికేయ 2 రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణుడు, ద్వారక నగరం లాంటి భక్తి అంశాలు, సస్పెస్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. 

36
Asianet Image

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో నిఖిల్ ప్రచార కార్యక్రమాలు షురూ చేశాడు. తాజాగా ఇంటర్వ్యూలో నిఖిల్ చెప్పిన విశేషాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కార్తికేయ 2 రిలీజ్ విషయంలో ఎదురైన ఇబ్బందులపై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కార్తికేయ 2 రిలీజ్ ఆలస్యం అయింది. నిర్మాతలకు వడ్డీలు కూడా పెరిగిపోయాయి. 

46
Asianet Image

పలుమార్లు చిత్రం వాయిదా పడింది. ఇటీవల విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ అడ్డంకులు సృష్టించారు. నాకు బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు అని నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీ సినిమాని తర్వాత రిలీజ్ చేసుకో. ఇప్పుడు రిలీజ్ చేస్తే థియేటర్స్ ఇవ్వం అని సుతిమెత్తగా బెదిరించారు. ఆ టైంలో నేను ఏడ్చేశా అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యారు. 

56
Asianet Image

కానీ ఎట్టకేలకు ఈ చిత్రం ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. దిల్ రాజు లాంటి నిర్మాతలు మొదట సోలో రిలీజ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు అని నిఖిల్ తెలిపాడు. 

66
Asianet Image

ఈ చిత్రం కార్తికేయ మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంటుంది అని నిఖిల్ తెలిపాడు. ద్వారకలో కృష్ణుడు నిర్మించిన నగరం ఏమైంది.. లాంటి మిస్టీరియస్, థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని నిఖిల్ తెలిపాడు. సెన్సార్ సభ్యుల నుంచి అదిరిపోయే టాక్ వచ్చినట్లుగా కూడా నిఖిల్ పేర్కొన్నాడు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories