MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఫస్ట్ లుక్ కేక... రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు దెబ్బ కొట్టదు కదా?

ఫస్ట్ లుక్ కేక... రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు దెబ్బ కొట్టదు కదా?

 బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఇది మరింత ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఓ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

4 Min read
Author : Surya Prakash
Published : May 06 2024, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Vikram Dhruv Bison

Vikram Dhruv Bison


స్టార్‌ హీరో రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో ఓ ప్రాజెక్ట్‌  ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అఫీషియల్ ఎనౌన్సమెంట్  వచ్చి చాలా రోజులైంది. దీంతో అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన  ప్రతీ వార్తను రామ్‌ చరణ్ (Ram charan) అభిమానులు షేర్‌ చేస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఇది మరింత ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఓ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Bison

Bison

ఈ చిత్రంలో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త.   ఈ విషయం గురించి బుచ్చిబాబుని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, తను బదులిస్తూ.. "ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువుగా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అంటే నేను చెప్పలేను. నేను ఎప్పుడు ఒక జోనర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని కథ రాసుకోను. నా సినిమాని అన్ని సెక్షన్ అఫ్ ఆడియన్స్ చూసేలా చిత్రీకరిస్తుంటా" అంటూ బదులిచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అవును అని చెప్పలేదు, కాదు అని కూడా చెప్పలేదు. అయితే కబడ్డీ ప్లేయర్ అనేది అంతటా వినిపిస్తున్న విషయం.
 

313

అలాగే గతంలో రామ్ చరణ్ నేషనల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. ఒక పల్లెటూరి మట్టి కథతో కంప్లీట్ ఎమోషన్స్ తో RC16 ఉంటుందని చెప్పుకొచ్చాడు. చరణ్ అండ్ బుచ్చిబాబు మాటలు కలిపి చూస్తే.. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంతోనే కాకుండా ఫ్యామిలీ , పల్లెటూరు మట్టి కథలతో ఉండనుందని తెలుస్తుంది.  
 

413


ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటే... తమిళంలోనూ ఓ పెద్ద డైరక్టర్ కబడ్డీ నేపధ్యంలో వస్తున్నాడు. ఈ చిత్రానికి బైసన్ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఆ ఫస్ట్ లుక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. అలాగే ఈ చిత్రం తమిళ,తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఒకే నేపధ్యం కావటంలో రామ్ చరణ్ ,బుచ్చిబాబు సినిమాకు దెబ్బ కొడుతుందేమో అని సోషల్ మీడియా జనం సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

513
Ram Charan

Ram Charan


బైసన్ విషయానికి వస్తే....శివపుత్రుడు అపరిచితుడు వంటి సినిమాలతో తెలుగులో సైతం అభిమానులను సంపాదించుకున్నారు తమిళ స్టార్ హీరో విక్రమ్. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్‌ విక్రమ్‌.ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు.

613


ఈ చిత్రానికి పరియేరుమ్‌ పెరుమాళ్‌, కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాల ఫేమ్‌ మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులైంది. తర్వాత అంతా సైలెంట్‌గా ఉండటంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. కబడ్డీ నేపథ్యంలో లో రూపోందుతున్న ఈ సినిమా కోసం దృవ్ ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు..

713

ఈ సినిమాలో హీరోకు జోడిగా మల్లు బ్యూటీ దర్శనా రాజేంద్రన్‌ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్‌, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూల్ త్వరలోనే  ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేసెయ్యాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది..  

813


 కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇక ధ్రువ్‌ విక్రమ్ (DhruvVikram) తండ్రి బాటలోనే పయనిస్తూ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు యాక్టర్‌. ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బీసన్‌ (Bison) టైటిల్‌ ఫైనల్‌ చేశారు.   
 

913


బీసన్‌ టైటిల్‌ లుక్‌ చూస్తే.... బ్యాక్‌ డ్రాప్‌లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు రెడీ అన్నట్టుగా ఉన్న స్టిల్‌ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మూవీని మారి సెల్వరాజ్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. మారి సెల్వరాజ్‌ ఇలా తొలిసారి ఇంగ్లీష్‌లో టైటిల్‌ పెట్టడం విశేషం. ధ్రువ్‌ విక్రమ్‌ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని తాజా లుక్‌ చెప్పకనే చెబుతోందంటున్నారు అభిమానులు. 

1013


హీరో ధృవ్ విషయానికి వస్తే....ఆదిత్య వర్మ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. తెలుగు అర్జున్ రెడ్డి కు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేదు..  . ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్‌ చిత్రంలో నటించారు.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో హీరోగా పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు.. దాంతో ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చినా.. రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు. అందుకే కమర్షియల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు జూనియర్ చియాన్‌ ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ఈ  కొత్త సినిమాతో రాబోతున్నాడు..
 

1113


ఇక రామ్ చరణ్ ,బుచ్చిబాబు సినిమా విషయానికి వస్తే... దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఉప్పెన మూవీతో బుచ్చిబాబు సంచలనం సృష్టించాడు. ఈ మూవీ గతేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో అతడు చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడు? అతన్ని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది.
 

1213


ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం.

1313

ప్రస్తుతం రామ్ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. కియారా అడ్వాణీ హీరోయిన్‌. దీని షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved