Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Rashmika:విజయ్ దేవరకొండతో పెళ్లి... మొదటిసారి నోరువిప్పిన రష్మిక.. బాగా ఎంజాయ్ చేశానంటూ క్రేజీ కామెంట్స్

Rashmika:విజయ్ దేవరకొండతో పెళ్లి... మొదటిసారి నోరువిప్పిన రష్మిక.. బాగా ఎంజాయ్ చేశానంటూ క్రేజీ కామెంట్స్

చాలా కాలంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందాన పెళ్లి వార్త చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మరోసారి ఈ వార్త హైలెట్ అయ్యింది. బాలీవుడ్ మీడియాలో విజయ్ దేవరకొండతో రష్మిక వివాహం అంటూ వరుస కథనాలు వెలువడ్డాయి.   

Sambi Reddy | Published : Feb 28 2022, 01:57 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

గీత గోవిందం మూవీలో మొదటిసారి జతకట్టిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక... అనంతరం డియర్ కామ్రేడ్ మూవీలో నటించారు. డియర్ కామ్రేడ్ చిత్రంలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. అంతగా లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోవడానికి ఆఫ్ స్క్రీన్ లో వాళ్ల మధ్య ఉన్న అనుబంధమే అంటూ పుకార్లు రేగాయి.

27
Asianet Image

మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకు బలం చేకూర్చుతూ వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. రష్మిక (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యారు. వాళ్ళ కుటుంబం జరుపుకునే ప్రైవేట్ పార్టీలలో రష్మికకు మాత్రమే ఆహ్వానం ఉంటుంది. హైదరాబాద్ మిత్రులను కూడా వదిలేసి ఎక్కడో కర్ణాటకలో ఉన్న రష్మికను విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 

37
Asianet Image

ఇక తరచుగా ముంబై వీధుల్లో ఈ జంట షికార్లు చేయడం పెళ్లి కథనాలకు ఊతం ఇస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక లేట్ నైట్ డిన్నర్స్ లో పాల్గొంటూ అనేక మార్లు కెమెరా కంటికి చిక్కారు. మరి ముంబై కల్చర్ ప్రకారం రిలేషన్షిప్ లో ఉన్న సెలెబ్రిటీలు నైట్ పార్టీలు, డిన్నర్స్ లో పాల్గొంటారు.

47
Asianet Image

ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం (Rashmika-Vijay devarakonda marraiage) చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఇది దేశవ్యాప్తంగా న్యూస్ అయ్యింది. కాగా ఈ వార్తలపై విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యారు. ఓ పచ్చిబూతు ట్విట్టర్ లో కామెంట్ చేసి, నాన్సెన్స్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. 
 

57
Asianet Image

విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి రష్మిక తాజాగా స్పందించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రష్మిక మాట్లాడారు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెళ్లి వార్తలపై కామెంట్ చేశారు.

67
Asianet Image

రష్మిక సదరు వార్తలను ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి వార్తలు చాలా కామన్. రాసుకోండి నాకు ఇబ్బందేం లేదు. పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం ఉంది... అంటూ రష్మిక సదరు వార్తల్లో నిజం లేదని తేల్చిపారేశారు. అలాగే ఆ వార్తలను తాను చాలా లైట్ గా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

77
Asianet Image

ప్రస్తుతం రష్మిక వయసు 25. అంటే వివాహానికి కరెక్ట్ ఏజ్. అయితే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్స్ కి మాత్రం పెళ్లికి ఎర్లీ ఏజ్ అన్నమాట. ముప్పై దాటినా తారలు పెళ్లి మాటెత్తరు. కెరీర్ నెమ్మదించి ఫేడ్ అవుట్ దశకు చేరాక గాని పెళ్లి చేసుకోరు. ఆ విధంగా చూసుకుంటే రష్మిక పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం ఉంది. అలాగే ఆమె చేతి నిండా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories