MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీ నాన్న గొప్పోడు ఓకే నువ్వేం పీకావ్, నా ఫోన్ ఎత్తవా?... గోపీచంద్ తో గొడవకు దిగిన డైరెక్టర్ తేజ!

మీ నాన్న గొప్పోడు ఓకే నువ్వేం పీకావ్, నా ఫోన్ ఎత్తవా?... గోపీచంద్ తో గొడవకు దిగిన డైరెక్టర్ తేజ!

డైరెక్టర్ తేజ-హీరో గోపీచంద్ మధ్య వాడివేడి సంభాషణ నడిచింది. ఓ ఇంటర్వ్యూలో కలిసిన వీరిద్దరూ ఓపెన్ గా మాట్లాడుకున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 25 2023, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ramabanam promotions

Ramabanam promotions

దర్శకుడు తేజ ముక్కోపి అనే పేరుంది. తన చిత్రాల్లో నటించిన పలువురు ఆర్టిస్ట్స్ పై చేయిచుకున్నారని టాక్. తాజా ఇంటర్వ్యూ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. స్టార్డమ్ అనుభవించిన హీరో గోపీచంద్ ని తన మాటలతో నేరుగా టార్గెట్ చేశాడు. మొహమాటం లేకుండా కడిగిపారేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రామబాణం మూవీ విడుదల నేపథ్యంలో హీరో గోపీచంద్ ని తేజ ఇంటర్వ్యూ చేశారు. బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ వద్దకు ఎలా వచ్చింది? డైరెక్టర్ శ్రీవాస్ తో గొడవలయ్యాయట కదా? అని అడిగారు. సినిమాలో లెన్త్ లు ఎక్కువైపోతున్నాయి. గతంలో ఇలా జరిగిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ విషయంలో డిఫరెన్సెస్ వచ్చాయని గోపీచంద్ ఒప్పుకున్నాడు. బాలయ్యతో అనుకున్న మూవీ తన వద్దకు ఎలా వచ్చిందో కూడా చెప్పాడు. 
 

36

అనంతరం నీకు ఇష్టమైన మూవీ ఏంటని తేజ అడిగారు. గోపీచంద్ జయం అని చెప్పారు. ఆ మూవీ కేవలం మీ నాన్న వలన నీకు దక్కింది. అలాంటి ఫౌండేషన్ నీకు మరలా పడలేదని నా నమ్మకం అని తేజ అన్నారు. అలాగే ఆ చిత్రంలో నువ్వు చేసింది విలన్ క్యారెక్టర్ అని గుర్తు చేశాడు. 
 

46
Ramabanam promotions

Ramabanam promotions


తనతో మూవీ ఓకే చేసి తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని గోపీచంద్ ని తేజ నిలదీశాడు. నేను నీకు ఒక కథ చెప్పాను. ఓకే అన్నావు. హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ ని సెట్ చేసే లోపు సడన్ గా మరో మూవీ స్టార్ట్ చేశావు. నువ్వు నా ఫోన్ కూడా ఎత్తలేదు... అని తేజ అసహనం వ్యక్తం చేశాడు. ఫోన్ ఎత్తలేదు. అది నా తప్పే అని గోపీచంద్ ఒప్పుకున్నాడు. 

56
Ramabanam promotions

Ramabanam promotions

తేజ కంటే ఈ డైరెక్టర్ బెటర్ పక్కన పెట్టేద్దాం. ఫోన్ చేసినా ఎత్తొద్దని డిసైడ్ అయ్యావ్.. అంతేగా అని తేజా మరలా గోపీచంద్ ని టార్గెట్ చేశాడు. ముఖాన అడిగేశాడు. అందుకు గోపీచంద్... అసలు మీకు ఎందుకు అంత గ్యాప్ వస్తుందని అడిగారు. నేను ఎవరి దగ్గరికీ ఆఫర్ కావాలని వెళ్ళను అని తేజ సమాధానం చెప్పారు. 
 

66

ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ ఫాదర్ టి.కృష్ణ ప్రస్తావన వచ్చింది. ఆయన గొప్పోడే, నువ్వేం పీకావ్ అంటూ తేజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ ని డైరెక్టర్ తేజ ఎన్కౌంటర్ చేశారు. రేపు పూర్తి ఇంటర్వ్యూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved