- Home
- Entertainment
- రెడ్ డ్రెస్ లో పరువాల విందు, వివాదంపై డింపుల్ హాట్ కామెంట్స్.. ఏ మహిళా చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్
రెడ్ డ్రెస్ లో పరువాల విందు, వివాదంపై డింపుల్ హాట్ కామెంట్స్.. ఏ మహిళా చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్
గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి.

గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది.
ఖిలాడీ, రామబాణం లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీనితో డింపుల్ హయతి తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో ఆమె ఓ వివాదం లో చిక్కుకుంది.
హీరోయిన్ డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే మధ్య వివాదం సంచలనంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో డింపుల్ హయతి.. రాహుల్ హెగ్డే కారుని కాలుతో తన్నడం, దురుసుగా ప్రవర్తించినట్లు రాహుల్ కారు డ్రైవర్ కేసు నమోదు చేయగా ఇది వివాదంగా మారింది. ఇరువురు తమ తమ వాదనలని వినిపిస్తున్నారు.
సిసి టివి ఫుటేజ్ లో డింపుల్ హయతి దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానీ తాను ఎలాంటి తప్పు చేయలేదని. అమ్మాయిని కాబట్టి కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని డింపుల్ హయతి వాదిస్తోంది. తన లాయర్ తో వాదనలు వినిపిస్తోంది. అయితే ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి.
తాజాగా డింపుల్ హయతి తన డస్కీ అందాలతో కుర్రకారుని ఫిదా చేస్తూ రెడ్ హాట్ లుక్స్ షేర్ చేసింది. ఫ్లోర్ పై విరహంతో దొర్లుతున్నట్లుగా ఉన్న పిక్స్ నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.
విరహం కమ్మేసినట్లుగా ఉన్న ఫొటోస్ తో డింపుల్ మాయ చేస్తోంది. అయితే ఈ ఫొటోస్ కి ఆమె ఇచ్చిన క్యాప్షన్ వైరల్ గా మారింది. ఐపిఎస్ అధికారితో వివాదం గురించి డింపుల్ పరోక్షంగా ఈ ఫొటోస్ పై కామెంట్స్ పెట్టింది.
నిజం వైపు నిలబడ్డప్పుడు మాత్రమే అధికారం, పరపతి ఉంటాయి. ప్రతి మహిళలో ఎరుపు తరహాలో తిరగబడే లక్షణం కూడా ఉంటుంది.. ప్రతి సారి చూస్తూ ఊరుకోదు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్న కామెంట్స్ చేసింది.
ఆమె ఫొటోస్ పై కామెంట్స్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. సిసి టివి ఫుటేజ్ లో నీదే తప్పు ఉన్నట్లు కనబడుతోంది. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయ్ అని సూచిస్తున్నారు.