- Home
- Entertainment
- తడిసిన అందాలతో సెగలు రేపుతున్న దీపికా పిల్లి.. వర్షంలో గంతులేస్తూ హీటు పెంచుతున్న `ఢీ` భామ..
తడిసిన అందాలతో సెగలు రేపుతున్న దీపికా పిల్లి.. వర్షంలో గంతులేస్తూ హీటు పెంచుతున్న `ఢీ` భామ..
`ఢీ` భామ దీపికా పిల్లి వేగంగా దూసుకొచ్చిన అందాల తరంగం. అంతే వేగంగా ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకున్న అందాల భామ. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తుందీ బ్యూటీ.

Deepika Pilli Instagram Photos
కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ కెరీర్ పరంగా బిజీ అయిన దీపికా పిల్లి(Deepika Pilli) తన సందడిని రెట్టింపు చేసింది. టీవీ షోలో హంగామా చేస్తూనే, ఇలా సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ చేస్తుంది. వరుసగా ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంది. నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
Deepika Pilli Instagram Photos
లేటెస్ట్ గా `ఢీ` భామ దీపికా పిల్లి గ్లామర్ విందు వడ్డించింది. వెకేషన్‌లో భాగంగా తాను దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో పొట్టి దుస్తులు ధరించి రెచ్చిపోవడం విశేషం. మోకాళ్లపైకున్న గౌనులో థైస్ అందాలతో రెచ్చగొడుతుంది దీపికా. ఎగిరి గంతులేస్తూ మరి కుర్రాళ్లకి సెగలు రేపుతుంది.
Deepika Pilli Instagram Photos
ప్రస్తుతం ఈ క్యూట్ అందాల భామ మున్నార్‌లో ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్‌లో (Deepika Pilli Vacation Photos) భాగంగా అక్కడి ప్రకృతిని ఆస్వాధిస్తుంది. ఓ వైపు ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా అటు వర్షాన్ని, ఇటు అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తుంది.
Deepika Pilli Instagram Photos
అసలే పొట్టి డ్రెస్, పైగా వర్షానికి తడిస్తే ఇంకేమైనా ఉందా. తడిసిన అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిందీ `ఢీ` భామ. ఈ నయా హాట్ ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. వర్షం టైమ్ లో ఇలా దీపికా పిల్లి వెకేషన్కి వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Deepika Pilli Instagram Photos
టిక్ టాక్‌తో దీపికా పిల్లి పాపులర్ అయిన విషయం తెలిసిందే. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, చలాకీతనం, అల్లరితనంతో ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలు విశేషంగా ఆదరణ పొందాయి. సోషల్ మీడియాలో అవి బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది దీపికా పిల్లి.
Deepika Pilli Instagram Photos
అంతకు ముందే నటిగా ప్రయత్నాలు చేసింది దీపికా. టిక్ టాక్ రావడంతో ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ప్రతిభతిని వెలికితీయడంతో ఈటీవీ వాళ్లు ఆమెకి `ఢీ`షోలో అవకాశాన్ని కల్పించారు. అందులో యాంకర్‌గా మెరిసే ఛాన్స్ దక్కింది. క్వీన్స్ టీమ్ కి లీడర్ గా వ్యవహరిస్తూ ఫిదా చేసింది.
Deepika Pilli Instagram Photos
`ఢీ` షోలో ఉన్నన్ని రోజులు హైపర్ ఆదితో బాగా పులిహోర కలుపుతూ ఎంతగానో ఆకట్టుకుంది. రష్మితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కో టైమ్ డాన్సులు కంటే వీరి హంగామానే హైలైట్ అవుతుంటుంది. అందులో దీపికా పిల్లిది ప్రత్యేక స్థానంగా చెప్పొచ్చు.
Deepika Pilli Instagram Photos
`ఢీ 13` వ సీజన్‌లో మెరిసిన ఆమె `ఢీ 14` వ సీజన్ నుంచి తప్పుకుంది. నిర్వహకులు ఆమెని తొలగించారు. రష్మి, సుధీర్, పూర్ణలతోపాటు దీపికా పిల్లిలను సైతం తొలగించడంతో కొన్ని రోజులపాటు ఖాళీగానే ఉంది దీపికా పిల్లి.
Deepika Pilli Instagram Photos
మధ్య మధ్యలో ఒకటి అర షోస్ చేసింది. ఇక నెమ్మదిగా తన వంతు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో `కామెడీ స్టార్స్` లో యాంకర్‌గా చేసే చాన్స్ ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె కామెడీ స్టార్స్ కి హోస్ట్ గా చేస్తుంది.
Deepika Pilli Instagram Photos
ఈ షో కోసం ప్రతి వారం అందంగా ముస్తాబై ఫోటోలకు పోజులిస్తుంది. తన గ్లామర్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల విందులో తనది ప్రత్యేక స్థానం అని నిరూపించుకుంటుంది. ఆరబోతలో తగ్గేదెలే అని చాటుకుంటోందీ క్యూట్ బ్యూటీ.