- Home
- Entertainment
- బ్రెస్ట్ పెరగడం కోసం అలా చేయమని చెప్పాడు, అంత అసభ్యంగానా.. దీపికా పదుకొనె హాట్ కామెంట్స్
బ్రెస్ట్ పెరగడం కోసం అలా చేయమని చెప్పాడు, అంత అసభ్యంగానా.. దీపికా పదుకొనె హాట్ కామెంట్స్
దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. ఇటీవల దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో దీపికా బోల్డ్ రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. మునుపెన్నడూ లేని విధంగా దీపికా బోల్డ్ గా ఈ మూవీలో రెచ్చిపోయింది. ఇదిలా ఉండగా దీపికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీపికా నేరుగా ఇండస్ట్రీలోకి వచ్చేయలేదు. దీపికా మొదట్లో టెన్నిస్ ప్లేయర్. ఆ తర్వాత మోడలింగ్ లోకి వచ్చింది.
Deepika Padukone
18 ఏళ్ల వయసులోనే దీపికా మోడలింగ్ మొదలుపెట్టింది. దీని గురించి దీపికా మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో ఉన్నప్పుడు ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. వారిలో కొందరు మంచిగా అడ్వైజ్ చేస్తే మరికొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఆ టైంలో తనకు ఓ చేదు సంఘటన ఎదురైనట్లు దీపికా తెలిపింది.
మోడలింగ్ చేస్తున్నప్పుడు. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నా బ్రెస్ట్ గురించి మాట్లాడుతూ.. అవి బాగా పెరగడం కోసం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకోవాలని సూచించాడు. అది నాకు చాలా అసభ్యంగా అనిపించింది. బాధపడ్డాను. కానీ పరిణితితో అలోచించి అతడి మాటలని సీరియస్ గా తీసుకోలేదు. నా శరీరాన్ని సహజంగానే ఉంచుకున్నాను అని దీపికా వివరించింది.
ఇక తన రెండవ సినిమాలోనే షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ తో నటించే అవకాశం దక్కడం అదృష్టం అని పేర్కొంది. ఓం శాంతి ఓం లో దీపికా షారుఖ్ సరసన నటించింది. మనం ఏ పని చేసినా మంచి అనుభవాల్ని మిగిల్చే వ్యక్తులు పక్కనే ఉండాలి అని ఆ సమయంలో షారుఖ్ సలహా ఇచ్చారు. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. మనం చేసే పని కూడా మన జీవితంలో భాగమే అని షారుఖ్ చెప్పినట్లు దీపికా గుర్తు చేసుకుంది.