MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నంది అవార్డులపై ఇంట్రెస్ట్ లేదా?.. టాలీవుడ్‌ ప్రముఖులకు సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు.. కొత్త అవార్డులివే!

నంది అవార్డులపై ఇంట్రెస్ట్ లేదా?.. టాలీవుడ్‌ ప్రముఖులకు సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు.. కొత్త అవార్డులివే!

టాలీవుడ్‌లో సినిమా ప్రతిభని, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త అవార్డులు తీసుకురాబోతుంది. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 30 2024, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా కళా రంగాన్ని ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో, కళాకారుల ప్రతిభ, వారి సేవాలను గుర్తించే ఎంకరేజ్‌ చేసే క్రమంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నంది అవార్డులను అందించేది ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పోరాటాల ఫలితంగా ఆ అవార్డులు ఆగిపోయాయి. రెండు రాష్ట్రాలు విడిపోయాక.. అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాకతీయ అవార్డుల, సింహా అవార్డుల పేరుతో పురస్కారాలు ఇవ్వాలని భావించింది. 
 

26

మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నంది అవార్డుల పేరుతోనే ఓ ఏడాది అవార్డులను ప్రకటించింది. కానీ వివాద్ కావడంతో దాన్ని ఆపేశారు. అప్పట్నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఆ అవార్డుల ఊసేలేదు. తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. అవార్డుకి పేరుకి సంబంధించిన కమిటీని కూడా వేశారు. సింహా అవార్డులు అనే పేరుని పరిశీలించారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇండస్ట్రీ పెద్దలు కూడా దానిపై ఆసక్తి చూపించలేదు. ఎవరూ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు. దీంతో అంతా లైట్ తీసుకున్నారు.

36

ఈ నేపథ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలు ఈ నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అసలు ఇలా ఒక అవార్డులు ఉండేవనే విషయమే మర్చిపోయే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఆ మధ్య చిరంజీవికి పద్మవిభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంగా నంది అవార్డుల ప్రస్తావన తెచ్చారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులను తెస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు సలహాలు, సూచనలు చేయాలని తెలిపారు. 
 

46

దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్‌ పెద్దలకు చురకలు అంటించారు. డిసెంబర్‌ 9న నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్దులను తెస్తామని ప్రకటించామని, దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సూచనలు, సలహాలు చేయాలని ఇండస్ట్రీ పెద్దలను కోరాను. కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు, ఏ కారణం చేత వాళ్లు స్పందించలేదో తెలియదు. కానీ గద్దర్‌ పేరుతో అవార్డులను తీసుకురావాలనుకుంటున్నాం.

56

ఈ లోపు ఇండస్ట్రీ నుంచి స్పందించి వారు ఏమైనా సలహాలిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటాం. లేదంటే ముందు చెప్పినట్టుగానే డిసెంబర్‌ 9న అవార్డులు ఇవ్వాలది నిర్ణయిస్తాం. గద్దర్‌ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, మాకు ఏది బాగా అనిపిస్తుందో దానితోనే ముందుకు వెళ్తాం అని తెలిపారు రేవంత్‌ రెడ్డి.
 

66
revanth reddy.j

revanth reddy.j

మురళీ మోహన్‌ ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో సీఎం రియాక్ట్ అవుతూ టాలీవుడ్‌ పెద్దలకు చురకలు అంటించారు. ప్రభుత్వం చెప్పినా స్పందించకపోవడంతో ఒకింతా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు అనిపిస్తుంది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎగిరి గంతులేశారు. బట్టలు చించుకుని అభిమానాన్ని చాటుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి స్పందించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ అవార్డుల విషయం ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
జూనియర్ ఎన్టీఆర్ ని బాధపెట్టిన సినిమా, తారక్ ఆ మూవీ ఎందుకు చేయలేదంటే?
Recommended image2
OTT Movies : ఓటీటీలో సినిమాల జాతర, 15 పైగా మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
Recommended image3
చిరంజీవి చేతికి ఏమయ్యింది? కట్టుతో కనిపించిన మెగాస్టార్, షాక్ లో అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved