MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చిరంజీవి నన్ను పార్టీలకు పిలవలేదు.. నేను అలాంటి రకం కాదు.. విజయశాంతి షాకింగ్‌ కామెంట్‌..

చిరంజీవి నన్ను పార్టీలకు పిలవలేదు.. నేను అలాంటి రకం కాదు.. విజయశాంతి షాకింగ్‌ కామెంట్‌..

చిరంజీవిపై, 80 బ్యాచ్‌ పార్టీలపై లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి స్పందించారు. తనని ఎప్పుడూ మెగాస్టార్‌ ఆహ్వానించడం లేదని వెల్లడించింది రాములమ్మ.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 01 2024, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్‌లో రెండో తరం నటీనటుల్లో చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో అనేక సినిమాలు వచ్చాయి. మోస్ట్ హిట్‌ పెయిర్‌గా ఈ జోడీకి ఉంది. ఈ కాంబినేషన్‌లో సుమారు 19 సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని కీలక పాత్రల్లో విజయశాంతి మెరవగా, మరికొన్ని గెస్ట్ రోల్స్ ఉండటం విశేషం. చివరగా `మెకానిక్‌ అల్లుడు` చిత్రంలో నటించారు. మళ్లీ కలిసి పనిచేయలేదు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల `విశ్వంభర`లో విజయశాంతి నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలుస్తుంది. అయితే విజయశాంతికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో చిరంజీవితో పనిచేయడం గురించి విజయశాంతి స్పందించింది. వండర్‌ఫుల్‌ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. ఎన్నో హిట్‌ మూవీస్‌ చేసినట్టు తెలిపింది. తమ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉండేదని వెల్లడించింది. దీంతోపాటు బాలయ్యతోనూ ఆల్మోస్ట్ సమానంగానే సినిమాలు చేసినట్టు తెలిపింది విజయశాంతి. 
 

36

అయితే వీరంతా 80బ్యాచ్‌కి చెందిన ఆర్టిస్ట్ లు. వారంతా ప్రతి ఏడాది కలుస్తుంటారు. పార్టీలు చేసుకుంటారు. ప్రతి ఏడాది ఒక స్టార్‌ ఆతిథ్యమిస్తుంటారు. ఇటీవల రెండు మూడు సార్లు చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ జరగడం విశేషం. ఇందులో చిరంజీవి, వెంకటేష్‌, నరేష్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, ప్రభు, టైగర్‌ ష్రాఫ్‌, రమేష్‌ అరవింద్‌, భాను చందర్‌, నాగార్జున, సుమన్‌ అలాగే రమ్యకృష్ణ, జయసుధ, నదియ, రాధ, శోభన, ఖుష్బూ, సుహాసిని, సుమలత, రాధిక ఇలా అప్పట్లో స్టార్లుగా వెలిగిన వారంతా కనిపిస్తుంటారు. కానీ విజయశాంతి ఇందులో మిస్సింగ్‌.
 

46

ఈ పార్టీలకు సంబంధించిన ప్రశ్న విజయశాంతికి ఎదురయ్యింది. అందరు కనిపిస్తారు. మీరు ఎందుకు కనిపించరు అనే ప్రశ్న అడిగింది యాంకర్‌. దీనికి లేడీ సూపర్‌ స్టార్‌ స్పందిస్తూ, తనని చిరంజీవి ఎప్పుడూ పిలవలేదని చెప్పింది. ఆయా పార్టీలకు తనని పిలవరని వెల్లడించింది విజయశాంతి. అంతేకాదు, ఇలాంటి పార్టీలకు తాను దూరం అని స్పష్టం చేసింది. తాను షూటింగ్‌, లేదంటే ఇళ్లు, రాజకీయ ఉద్యమాలు, లేదంటే ఇళ్లు, ఇలానే ఉంటుందని, ఇలాంటి పార్టీలకు వెళ్లే రకాన్ని కాదు అని వెల్లడించింది. 
 

56

చిరంజీవి తనని పిలిచే ప్రయత్నం చేయలేదు, ఒకవేళ పిలిచినా తాను వెళ్లను అని చెప్పింది. ఈ పార్టీలకు తనకు నచ్చవు అని, అందుకే దూరంగా ఉంటానని, ఎప్పుడూ తనని ఆహ్వానించే ప్రయత్నం చేయరు అని వెల్లడించింది. తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని చెప్పింది. షూటింగ్‌లు, ఇళ్లు తప్ప తనకు వేరే ప్రపంచం ఉండదని వెల్లడించింది. అందుకే ఆ 80 బ్యాచ్‌లో, ఆ పార్టీల్లో తాను ఉండనని తెలిపింది ఐ డ్రీమ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది విజయశాంతి. 

66

ఇదిలా ఉంటే విజయశాంతి సినిమాలు మానేసి సుమారు 15ఏళ్లు అవుతుంది. ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇటీవల మాత్రం సైలెంట్‌గా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో హడావుడి కనిపించినా ఆమెకి సీట్లు దక్కలేదు. దీంతో మళ్లీ సైలెంట్‌ అయ్యింది. ఆ మధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్‌ బాబు హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved