MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bollywood Heroines Remuneration: రెమ్యూనరేషన్ తో బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు...

Bollywood Heroines Remuneration: రెమ్యూనరేషన్ తో బాలీవుడ్ కు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు...

బాలీవుడ్ మేకర్స్ కు రెమ్యునరేషన్ డిమాండ్ తో చుక్కలు చూపిస్తున్నారు హీరోయిన్స్. హీరోలకు మేం తక్కువ కాదు అని నిరూపించుకుంటూ.. సోలో సినిమాలతో అదరగొడుతున్నారు. హిట్ మీద హిట్ కొడుతూ.. రేట్లు అమాంతం  పెంచేస్తున్నారు.

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 28 2022, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

హీరోయిన్ల  రెమ్యూనరేషన్లు లక్షల మాట ఎప్పుడో మర్చిపోయారు. కోట్లకి కోట్లు అందుకుంటున్నారు. కొట్లకు కోట్లు డిమాండ్చేస్తున్నారు. హార్డ్ వర్క్ తో నేమ్ ఫేమ్ మాత్రమే కాదు ఎర్నింగ్స్ లోనూ పీక్స్ కు చేరుకుంటున్నారు. మన సౌత్ హీరోయిన్ల తో పోల్చుకుంటే బాలీవుడ్ రేంజ్ 10 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. అందుకే మన సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్ళాలని తహతహలాడుతున్నారు. అది సరే ఇప్పుడు  బాలీవుడ్ లో ఏ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకుంటుందో చూద్దాం.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

బాలీవుడ్ లో సీనియర స్టార్ హీరోయిన్ల దగ్గరకు వెళ్ళే ముందు..మొన్నమొన్న వచ్చిన యంగ్ జనరేషన్ హీరోయిన్ల విషయం చూస్తే.. ఈ మధ్య వచ్చిన వారే ఇక్కడ కోటి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్  కూతురు జాన్వీ కపూర్ , అనన్య పాండే కోటిన్నర తీసుకుంటుంటే .. దిశాపటానీ, సారా అలీఖాన్  కూడా మేమేం తక్కువ అంటూ  ఒక్కో మూవీకి ఒకటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకూ రాబడుతున్నారు.

311

ఇక సీనియర్ల విషయానికి వస్తే.. రెమ్యూనరేషన్ తో హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్లలో  దీపికా పదుకోన్ ఒకరు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన దీపికా ఒక్కో సినిమాకి దాదాపు 12 నుంచి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ అయిన రొమాంటిక్ మూవీ  గెహరాయియాకు కూడా దీపిక  15కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఈ టాప్ హీరోయిన్ సౌత్ తో ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తోంది. అటు నార్త్ లో వరసగా ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టింది.

411

దీపికా తర్వాత బాలీవుడ్ లో హ్యాపెనింగ్ హీరోయిన్ ఆలియాభట్. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా.. సినిమాలవిషయం లోనే కాదు ..రెమ్యూనరేషన్ విషయంలో కూడా సీనియర్లతో పోటీ పడుతోంది. సినిమాని బట్టి ..రెమ్యూనరేషన్ విషయంలో మార్పులు చేసుకుంటంది ఆలియా. ఈ ముద్దు గుమ్మ సినిమాకు దాదాపు 15కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇక రీసెంట్ గా సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయ్‌ కతియావాడి, కరణ్ జోహార్   రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ  ప్రాజెక్ట్స్ కోసం అలియా రెమ్యునరేషన్ తగ్గించుకుందట. కాని డార్లింగ్ మూవీ కోసం మాత్రం  15 కోట్లు ఫిక్స్ చేసిందనిసమాచారం.

511

సీనియర్ హీరోయిన్.. పైగా పెళ్లయ్యింది అయినా.. ఇంకా బాలీవుడ్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కొత్త పెళ్లికూతురు కత్రినా కైఫ్ కి. ఇంకా రెమ్యూనరేషన్ విషయంలోడిమాండ్ లోనే ఉంది. ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిన కత్రినా సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కత్రినా ప్రజెంట్ విజయ్ సేతుపతి మూవీ తో పాటు టైగర్ 3 సిరీస్ లో నటిస్తోంది. 

611

బాలీవుడ్ లో  నోరు పారేసుకునే హీరోయిన్ గాపేరు తెచ్చుకుంది  ఫైర్ బ్రాండ్ కంగనా. అటు సినిమాలతో పాటు షోస్ కూడా చేస్తూ.. బాగా సంపాదిస్తోంది. విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ..రెమ్యూనరేషన్ గట్టిగానే డిమాండ్ చేస్తుంది కంగనా. ప్రజెంట్ కంగనా సినిమాకు 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కంగనా ఇప్పుడు దాక్కడ్ , తేజస్ లాంటి లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తోంది.

711

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన కరీనా కపూర్  కూడా  బాగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. విజయేంద్ర ప్రసాద్ , అలౌకిక్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సీత సినిమాకి సంబందించి కరీనా కపూర్ 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తోంది. పెళ్లయ్యి ఇద్దరు పిల్లల తల్లైనా ..ఇంకా కరీనా కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.. అందుకే రెమ్యూనరేషన్ ఏమాత్రం తగ్గించుకోవట్లేదు కరీనా కపూర్.

811

ఇక బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది  ప్రీయాంకా చోప్రా.  టాప్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. అయినా సరే మన సినిమాలు మానేయలేదు.. రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేది లేదు అంటోంది. వరల్డ్ సినిమా స్క్రీన్ పై మెరుస్తున్న ఈ ఇండియన్ స్టార్ గర్ల్ ఈ మధ్య వచ్చిన ఓ సినిమాకు 8కోట్లు ఛార్జ్ చేసింది. కత్రినా, ఆలియా, ప్రియాంకా లీడ్ రోల్స్ లో తెరకెక్కబోతున్న  జీ లే జరా ప్రాజెక్ట్ కోసం  12కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్ టాక్.

911

ఇక  ఆషికీ హీరోయిన్  శ్రద్దా కపూర్  వరసగా సినిమాలు చేస్తూ రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటోంది.  సాహో తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ లవ్ రాంజన్ సినిమా కోసం 5 కోట్లకు పైనే డిమాండ్ చేస్తోంది. ఇక బ్యాక్ టూ బ్యాక్ విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ.. వరస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్న తాప్సీ కూడా  5కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు.

1011

బాలీవుడ్ లో ఒకప్పుడు  ట్రెండ్ సెట్ చేసిన విద్యాబాలన్  ఈమధ్య సినిమాల విషయంలో స్లో అయినా రెమ్యూనరేషన్ మాత్రం 4 కోట్ల దగ్గర ఫిక్స్ చేసేసింది. ఏజ్ బార్ అయితున్నా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటోంది.

1111

మరో వైపు  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్  చేస్తోన్న కృతి సనన్‌ 4కోట్ల రేంజ్ లో ఉంది. సీత పాత్రలో మెరుపులు మెరిపించబోతోంది కృతి. అటు  నార్త్, సౌత్ అనే తేడా ప్రాజెక్ట్స్ చేస్తోన్న కియారా లేటెస్ట్ గా వచ్చిన జుగ్ జుగ్ జియో కు రెండున్నర కోట్లు అందుకుంది. శంకర్ – రామ్ చరణ్ సినిమాకు 3 కోట్లు అడిగిందని సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved