MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సందీప్ వంగా సినిమా లో నటించినందుకు ఫీలవుతున్నా,పొరపాటు చేసాను

సందీప్ వంగా సినిమా లో నటించినందుకు ఫీలవుతున్నా,పొరపాటు చేసాను

‘ఇలాంటి సినిమాలో నేనెందుకు నటించానా?’’ అని చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యా. అంతెందుకు  ఫ్రెండ్ తో కలిసి సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లిన..కానీ, 

3 Min read
Author : Surya Prakash
Published : Apr 19 2024, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


సందీప్ వంగా వంటి స్టార్ సెన్సేషన్ డైరక్టర్ సినిమాలో నటించినందుకు ఎవరైనా ఫీలవుతారా..కానీ తాను ఫీలవుతున్నా అంటున్నారు ఓ ఆర్టిస్ట్. అయితే మన తెలుగు ఆర్టిస్ట్ కాదు..బాలీవుడ్ లో కాస్త పేరున్న ఆర్టిస్టే. అయితే అలా అంటే సందీప్ వంగా ఊరుకుంటాడా కాస్తంత ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. ఆర్టిస్ట్ ఏమన్నారు..సందీప్ ఏమి రిప్లై ఇచ్చారో ..ఏం జరిగిందో ఆ ఇంట్రస్టింగ్ కాన్వర్షేషన్ చూద్దాం. 

28


అర్జున్‌రెడ్డి(Arjun Reddy)చిత్రంతో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమాతోనే  దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు   సందీప్‌రెడ్డి . విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఆ సినిమా సెన్సేషన్ సక్సెస్ అయ్యింది. అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్‌సింగ్‌(Kabir singh) పేరుతో రీమేక్ చేసి మరో వైల్డ్ హిట్ అందుకున్నాడు. 

38


డెనిమిక్ డైరెక్టర్ సందీప్‌ నుండి చాలా గ్యాప్‌ తరువాత యానిమల్ తో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. విమర్శలు అందుకున్నాడు. ఇప్పటికి ఆ సినిమాని విమర్శిస్తూ కామెట్స్ చేసే వాళ్లు ఉన్నారు. ఇక   కబీర్ సింగ్ , యానిమల్ చిత్రాలతో చాలా మంది నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 

48

ఇక ‘కబీర్‌సింగ్‌’ మూవీలో కాలేజీ డీన్‌ క్యారెక్టర్ చేసిన బాలీవుడ్‌ సీనియర్‌ యాక్టర్ అదిల్‌ హుస్సేన్‌ మాత్రం తనకు అలాంటి గుర్తింపే వద్దన్నట్లు మాట్లాడాడు. ఈ ఆర్టిస్ట్ పై డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అదిల్‌ హుస్సేన్‌ అనే నటుణ్ని కబీర్ సింగ్ మూవీలో తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. ఈమేరకు తన ఎక్స్‌లో పెద్ద పోస్ట్‌ చేశారు. దాదాపు ఐదేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమాలో నటించిన ఒక నటుడిపై డైరెక్టర్ సందీప్‌ మండిపడటంతో వైరల్ అయ్యింది. 

58


అదిల్‌ హుస్సేన్‌ (Adil Hussain) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కబీర్‌ సింగ్‌ లో అనవసరంగా నటించానంటూ అసహనం వ్యక్తం చేశాడు. "ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన ఫస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది కబీర్‌ సింగ్‌ మాత్రమే అని అన్నారు. ఈ సినిమాలో కాలేజీ డీన్‌ పాత్రలో నటించాను.కానీ, సినిమాకి ముందు నేను ఎన్నిసార్లు నో చెప్పినా వినకుండా బ్రతిలాడారు. ఒకేఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. అందుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారు. 

68


దాంతో సెట్ కి వెళ్లి డైరెక్టర్ చెప్పిన సీన్‌ యాక్ట్‌ చేసి కామ్ గా వచ్చేశా. కానీ, ఆ సీన్‌ చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఇక సినిమా కూడా మొత్తం అలాగే ఉంటుందని భావించాను.తీరా రిలీజయ్యాక చూస్తే..‘‘ఇలాంటి సినిమాలో నేనెందుకు నటించానా?’’ అని చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యా. అంతెందుకు ఫ్రెండ్ తో కలిసి సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లిన..కానీ, నేను మధ్యలోనే బయటకు వచ్చేలా చేసింది. ఒకవేళ నా వైఫ్  కనుక మూవీ చూసి ఉంటే తప్పకుండా నన్ను తిట్టేది’’ అని హుస్సేన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

78


 "ఇప్పటి వరకు నా కెరీర్ లో ఏదైనా సినిమాలో ఎందుకు నటించానా అని అనుకున్నది వున్నది అంటే, అది ఒక్క 'కబీర్ సింగ్' మాత్రమే" అని వ్యాఖ్యలు చేశారు అదిల్ హుస్సేన్. 
ఆదిల్ హుస్సేన్ ఇంతకు ముందు కొన్ని హిందీ సినిమాల్లో నటించారు. అందులో 'ఇంగ్లీష్ వింగ్లిష్', 'ఏజెంట్ వినోద్', 'లైఫ్ ఆఫ్ పై', 'కాంచి: ది అన్ బ్రేకబుల్', 'బెల్ బాటమ్', 'పరీక్ష', 'సార్జెంట్' లాంటి సినిమాల్లో కనిపించారు..  
 

88
<p>Vijay devarakonda, Sandeep vanga</p>

<p>Vijay devarakonda, Sandeep vanga</p>


ఆదిల్ చేసిన వ్యాఖ్యలు దర్శకుడు సందీప్ రెడ్డి చూసి, వెంటనే చాలా ఘాటుగా సమాధానం 'ఎక్స్' లో ఇచ్చాడు. "మీరు గొప్పగా భావించి చేసిన 30 సినిమాలలో రాని గుర్తింపు, విజయాన్ని మీరు ఎందుకు 'ఈ సినిమాలో నటించానా' అనే ఈ ఒక్క సినిమాతో సొంతం చేసుకున్నారు. నా సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను, అని చెప్పారు సందీప్ వంగా. ఇంకా చెపుతూ, ఇకపై మీరు సిగ్గుపడాల్సిన పనిలేదు, ఎందుకంటే మీ మొహాన్ని ఏఐ సహాయంతో నేను మార్చేస్తా, అప్పుడు మీరు హాయిగా నవ్వుకోవచ్చు, అని పోస్ట్ చేశారు సందీప్ వంగా. ఇప్పుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Divorce: నిశ్చితార్థానికి ముందే విజయ్ అలా చేశాడు.. మొత్తం బయట పెట్టిన సంగీత
Recommended image2
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ప్రియదర్శితో రొమాన్స్.. దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ, వైరల్ ఫొటోస్
Recommended image3
ఇది కదా రాజమౌళి విజన్, వారణాసిలో 25 నిమిషాల ఎపిసోడ్..చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరణ, ఆ సెట్లు చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved