MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 6: ఓడిపోయిన రేవంత్... బిగ్ బాస్ తెలుగు 6 ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఆదిరెడ్డి!

Bigg Boss Telugu 6: ఓడిపోయిన రేవంత్... బిగ్ బాస్ తెలుగు 6 ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఆదిరెడ్డి!

కీలకమైన గేమ్ లో రేవంత్ ఓడిపోయినట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్ ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెల్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు వినికిడి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదిరెడ్డి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 30 2022, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్స్ నిర్వహిస్తున్నారు. టికెట్ గెలుచుకున్న సభ్యుడు నేరుగా ఫైనల్ కి చేరుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా ఆ కంటెస్టెంట్ ఉండడు. ఈ క్రమంలో ఫైనల్ కి చేరుకోవాలని కంటెస్టెంట్స్ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ స్నోమాన్ టాస్క్ నిర్వహించాడు. స్నోమాన్ బొమ్మ భాగాలు సేకరించి రూపొందించాలి. అదే సమయంలో తమ బొమ్మను ఇతర కంటెస్టెంట్స్ నుండి కాపాడుకోవాలి. ప్రతి రౌండ్ లో తక్కువ భాగాలతో స్నోమాన్ ని నిర్మించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ నుండి తప్పుకుంటాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

స్నోమాన్ టాస్క్ లో మొదట శ్రీసత్య తర్వాత కీర్తి, ఇనయా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడేందుకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. కీర్తి, ఇనయా, శ్రీసత్యల మధ్య ఒక గేమ్ పెట్టిన బిగ్ బాస్ గెలిచిన కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడవచ్చు అన్నారు. దీనిలో భాగంగా ముగ్గురూ తెల్ల టీషర్ట్స్ ధరించాలి. సర్కిల్ లో నిల్చొని పక్కనే ఉన్న రెడ్ పెయింట్ చేతులతో ఇతరుల వీపుపై రాసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ తమకు రాయకుండా కాపాడుకోవాలి. ఎక్కువ మొత్తంలో వీపుపై పెయింట్ ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఈ గేమ్ లో శ్రీసత్యకు ఎక్కువ పెయింట్ అయ్యింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. 
 

36
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో ఇనయా, కీర్తి నెక్స్ట్ రౌండ్ లో పోటీపడ్డారు. గెలుపు కోసం ఇనయా, కీర్తి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒకరి వీపుపై మరొకరు రెడ్ కలర్ రాసేందుకు శాయశక్తులా కృషి చేశారు. కిందా మీదా పడుతూ ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేశారు. బజర్ మోగగానే గేమ్ ఆపేశారు. సంచాలక్ గా ఉన్న రేవంత్ విన్నర్ ని నిర్ణయించడం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఇద్దరి టీషర్ట్స్ పై ఎక్కువగానే రంగు ఉంది అన్నారు. ఫైనల్ గా  కీర్తి గెలిచినట్లు ప్రకటించాడు. దీంతో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, కీర్తి, ఫైమా, శ్రీహాన్.. టికెట్ టు ఫినాలే కోసం పోటీపడ్డారు. 
 

46
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఈ ఆరుగురిలో విన్నర్ ని నిర్ణయించేందుకు ఒక గేమ్ నిర్వహించారు. ఆర్మీ ట్రైనింగ్ తరహాలో ఆరుగురు సభ్యులు పాకుతూ, దూకుతూ, ఎక్కుతూ టార్గెట్ ని చేరుకొని ఎత్తులో ఉన్న బాస్కెట్ లో బాల్ వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ అందరికంటే వెనుకబడిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. మిగతా వాళ్లు ముందుకు వెళతారు. అలాగే బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లే ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే అది కంటెస్టెంట్స్ కి నచ్చలేదు. 
 

56
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

కీలక సమయంలో ఏకాభిప్రాయం అంటే విబేధాలు వస్తాయి. గెలిచి ఓడిపోతే ఎలాంటి సమస్య ఉండదు అని పోటీలో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయపడ్డారు. దీంతో బిగ్ బాస్ మరికొన్ని టాస్క్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న ప్రతి విషయం లీక్ అవుతుంది. దాని ప్రకారం టికెట్ టు ఫినాలే ఆదిరెడ్డి గెలుచుకున్నాడట. ఈ టాస్క్ లో గెలిచి ఫైనల్ కి చేరే ఫస్ట్ కంటెస్టెంట్ నేనే కావాలని ఆశపడిన రేవంత్ కి షాక్ తగిలింది అంటున్నారు. 
 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఈ సమాచారంలో వాస్తవం ఎంత ఉందనేది మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే టికెట్ టు ఫినాలే గెలుచుకున్న ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నాడు. ఒకవేళ ఈ వారం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయితే అతనికి ఈ పాస్ ఉపయోగపడదు. ఇక 13వ వారానికి గానూ ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, ఫైమా, కీర్తి, శ్రీసత్య నామినేట్ అయ్యారు. శ్రీహాన్, ఇనయా నామినేషన్స్ లో లేరు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved