MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శివాజీ కూతురిని గెలికిన సుడిగాలి సుధీర్...రేయ్ పగిలిపోయిద్ది, కామన్ సెన్స్ లేదంటూ వార్నింగ్ !

శివాజీ కూతురిని గెలికిన సుడిగాలి సుధీర్...రేయ్ పగిలిపోయిద్ది, కామన్ సెన్స్ లేదంటూ వార్నింగ్ !

బిగ్ బాస్ ఫేమ్ శివాజీ కూతురిని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు సుడిగాలి సుధీర్. అలాగే ఆమెతో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఏరా పగిలిపోతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు శివాజీ. ఓ షోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 04 2024, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సుడిగాలి సుధీర్ ఆ మధ్య బుల్లితెరకు దూరమయ్యాడు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు గుడ్ బై చెప్పాడు. గత ఏడాది సుడిగాలి సుధీర్ ఒక హిట్ కూడా కొట్టాడు. ఆయన నటించిన గాలోడు చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గాలోడు తర్వాత విడుదలైన కాలింగ్ సహస్ర మాత్రం ప్రభావం చూపలేదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ గోట్ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీ ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. సిల్వర్ స్క్రీన్ ని నమ్ముకుని గుడ్డిగా వెళితే కరెక్ట్ కాదని సుడిగాలి సుధీర్ మరలా యాంకరింగ్ వైపు దృష్టి పెట్టాడు. 

39

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సర్కార్ సీజన్ 4కి హోస్ట్ గా చేస్తున్నాడు. అలాగే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో మరొక షో స్టార్ట్ చేశాడు. ఈ రెండు షోలలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ ఆకర్షణీయంగా ఉంది. తన మార్క్ కామెడీ, సెటైర్స్ తో ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు.

49
Sudigali Sudheer

Sudigali Sudheer

సర్కార్ గేమ్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. శివాజీ సైతం హాజరయ్యాడు. ఈ షోలో సుడిగాలి సుధీర్ కి శివాజీ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది . శివాజీ కూతురుని సుడిగాలి సుధీర్ గెలికే ప్రయత్నం చేశాడు. దాంతో శివాజీ సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇచ్చాడు.

59
Sudigali Sudheer

Sudigali Sudheer


వస్తూ వస్తూనే సుడిగాలి సుధీర్ మీద పంచులు వేశాడు శివాజీ. అన్నా ఆడియన్స్ ని నా గురించి ఏదైనా ఒక్కటి చెప్పండి అన్నా.. అని సుధీర్ దిగాడు. నీకేంటి సుధీర్ అందగాడివి, మామూలు స్పీడ్ కాదు.. అని శివాజీ పొగిడాడు. అన్నా అలాగే రెండు జోక్స్ చెప్పు అని శివాజీని సుధీర్ అడిగాడు. ఇప్పుడు చెప్పింది అవే కదా అని పంచ్ వేశాడు. 

69
Sudigali Sudheer

Sudigali Sudheer

అనంతరం బుర్ర ఉపయోగించే, కామన్ సెన్స్ ఉన్నోళ్లు ఎవరైనా ఆ కుర్చీలో కూర్చో వచ్చు... అని సుధీర్ గేమ్ షోలో చైర్ ని ఉద్దేశించి శివాజీతో అన్నాడు. అయితే కామన్ సెన్స్ ఉన్నోళ్లు అక్కడ ఉంటారు.. లేనోళ్ళు ఇక్కడ ఉంటారు, అంటూ శివాజీ, సుధీర్ మీద మరో పంచ్ వేశాడు. 
 

79
Sudigali Sudheer

Sudigali Sudheer

శివాజీ తర్వాత నాయని పావని షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఎంట్రీ సాంగ్ గా సూపర్ మూవీలోని 'దొరికినంత దోచుకో' సాంగ్ వేశారు. ఆ సాంగ్ కి సుధీర్, నయని పావని కలిసి డాన్స్ చేశారు. వెల్కమ్ అంటూ నయని పావనిని సుధీర్ హగ్ చేసుకోబోయాడు. నయనిని తప్పించి శివాజీ వచ్చి సుధీర్ ని హగ్ చేసుకుంటాడు. దాంతో సుధీర్ అవాక్కు అవుతాడు. పట్టేసుకుందామనే... అని శివాజీ సుధీర్ పై మరో పంచ్ వేశాడు. 
 

89
Sudigali Sudheer

Sudigali Sudheer

అసలు దొరికినంత 'దొరికినంత దోచుకో' సాంగ్ అర్థం ఏమిటో తెలుసా? అని నయని పావనికి సుధీర్ చెప్పే ప్రయత్నం చేశాడు. మధ్యలో కల్పించుకున్న శివాజీ 'పగిలిపోద్ది' అని సుధీర్ కి వార్నింగ్ ఇచ్చాడు. కాగా నయని పావనికి తండ్రి లేడు. బిగ్ బాస్ హౌస్ లో పరిచయమైన శివాజీని ఆమె తండ్రి కాని తండ్రిగా భావిస్తుంది. ఫాదర్-డాటర్ రిలేషన్ ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు. 
 

99
Sudigali Sudheer

Sudigali Sudheer

సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్లో నయని పావని, శివాజీలతో పాటు టేస్టీ తేజా, రతిక రోజ్ సైతం పాల్గొన్నారు. వారితో సుడిగాలి సుధీర్ షోని చాలా ఎంటర్టైనింగ్ గా నడిపాడు. ఆహా చందాదారులు ఈ షో చూసి ఎంజాయ్ చేయవచ్చు .   
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved