MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిన్ను ద్వేషిస్తున్నాను.. భర్తపై బిగ్ బాస్ ఫేమ్.. నేహా చౌదరి షాకింగ్ పోస్ట్.. కారణం ఏంటీ..?

నిన్ను ద్వేషిస్తున్నాను.. భర్తపై బిగ్ బాస్ ఫేమ్.. నేహా చౌదరి షాకింగ్ పోస్ట్.. కారణం ఏంటీ..?

తన భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది.. బిగ్ బాస్ ఫేమ్ నేహా చౌదరి. మల్టీ టాలెంట్ అని నిరూపించుకున్న నేహా చౌదరి .. తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 13 2023, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్  చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.  నిజంగా ఈ ఆర్టిస్ట్ లు ఉన్నారా అని చాలా మంది ఔరా అనుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఈ షోల్లో చాలా మంది నటీనటులు పాల్గొన్నారు. కొంత మంది కొత్త ముఖాలు కూడా వచ్చి తర్వాత సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు. కొంత మంది తెలిసినా.. ఫేమ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్‌తోనే. అలాంటివారిలో నేహా చౌదరి కూడా ఒకరు. ఆమె మల్టీ టాలెంటెడ్.  

26

నేహా చౌదరికి చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంది. యాంకర్, డ్యాన్సర్, యోగా ట్రైనర్, మోడల్, జిమ్నాస్ట్‌తో పాటు అథ్లెట్‌గా ఇలా రకరకాల రంగాల్లో  గుర్తింపు తెచ్చుకుంది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే.. ఆమె బిగ్ బాస్ 6 సీజన్లలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. అయితే గేమ్ బాగా ఆడినా కాని..  మూడవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.

36

 బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే పెళ్ళి చేసేసుకుంది బ్యూటీ.. బిగ్ బాస్ ఫైనల్స్ రోజే ఆమె  వివాహం జరిగింది. ఇంజనీరింగ్ చదివే టైంలో   అనిల్‌ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది నేహా.. పెళ్ళి తరువాత వెంటనే  ఆమె జర్మనీ వెళ్లిపోయింది. అనిల్ అక్కడే ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఆమె అక్కడకు వెళ్లింది. యూట్యూబ్ లో తన ఛానల్ చూసేవారికి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. 

46

అలాగే భర్తతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. అయితే పెళ్లి అయ్యి ఆరు నెలలు అయ్యిందో లేదో అప్పడే భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్టు పెట్టింది.

56

అందులో ‘నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను. ఎందుకంటే.. ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్, కేక్స్ వంటివి నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.. నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను. 

66

కానీ నువ్వు నాకు సారీ చెప్పి, మళ్లీ చేయనని చెప్పి..మాటిచ్చిన ఐదు నిమిషాలకే తప్పులు చేస్తావు. అయినప్పటికీ.. నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమించే విధానానికి నేను పడిపోయా. నువ్వు ఎప్పటికీ నావాడివే’ అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
అంత ధైర్యం నాకు లేదు, ఎంజీఆర్ గురించి పొరపాటున తప్పుగా మాట్లాడా.. క్షమాపణ కోరిన రాజేంద్ర ప్రసాద్
Recommended image2
మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. రామ్ చరణ్ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ రెడీ..
Recommended image3
NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved