Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది.   

Sambi Reddy | Updated : May 03 2024, 09:54 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Keerthi bhat

Keerthi bhat

సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. 
 

26
Keerthi bhat

Keerthi bhat

కీర్తి భట్ గత ఏడాది నిశ్చితార్థం జరుపుకుంది. కొన్నాళ్లుగా ఆమె విజయ్ కార్తీక్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అతన్నే వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యింది. నిశ్చితార్థం జరిగి నెలలు గడుస్తున్నా వివాహం చేసుకోవడం లేదు. పైగా పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

 

36
Keerthi bhat

Keerthi bhat

దీనిపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కీర్తి భట్ వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అంటున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు. సమాజ సేవకు ఖర్చు చేశాను. 

46
Asianet Image

పేరుకే సీరియల్ హీరోయిన్ ని. బిగ్ బాస్ షోకి వెళ్లినా కూడా డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే సేవింగ్ చేస్తున్నాను. పెళ్ళైన వెంటనే మేమిద్దరం వేసే మొదటి అడుగు మా సొంత ఇంట్లో అయ్యుండాలి. ఒకే ఇంట్లో ఉంటున్నాం. సహజీవనం చేస్తున్నాం. అందులో తప్పేమీ లేదు. సమాజానికి చెడు సందేశం ఇస్తున్నట్లు కాదు. 

56
Keerthi Bhat

Keerthi Bhat

మేము చెరో ఇంట్లో ఉండటం వలన ఖర్చు పెరుగుతుంది. ఒకే ఇంటిలో ఉంటూ డబ్బులు సేవ్ చేస్తున్నాము. నేను షూటింగ్ నుండి ఇంటికి రాగానే పలకరించే వ్యక్తి ఉంటే బాగుండు అనిపించేది. ఆ బాధ నాకు తెలుసు. విజయ్ కార్తీక్ నాకు డోర్ తీసి వెల్కమ్ చెబుతాడు. అది నాకు చాలా బాగుంది... అని చెప్పుకొచ్చింది.. 

 

66
Keerthi Bhat

Keerthi Bhat

కాబట్టి కీర్తి వివరణ ప్రకారం పెళ్లి కాకుండా కలిసి జీవించడం తప్పు కాదు. సొంత ఇల్లు నిర్మించుకునే వరకు పెళ్లి లేదని ఆమె చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం కీర్తి మధురా నగరిలో టైటిల్ తో ఒక సీరియల్ చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories