MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ నా భార్యకి ఫోన్‌ చేసి కాపురంలో చిచ్చు పెట్టాడు.. నందమూరి హీరో నిజ స్వరూపం బయటపెట్టిన నటుడు సమీర్‌

బాలకృష్ణ నా భార్యకి ఫోన్‌ చేసి కాపురంలో చిచ్చు పెట్టాడు.. నందమూరి హీరో నిజ స్వరూపం బయటపెట్టిన నటుడు సమీర్‌

బాలకృష్ణ అసలు రూపం బయటపెట్టాడు నటుడు సమీర్‌. తన భార్యకి తన ముందే ఫోన్‌ చేసి ఆ రోజు చేసిన పనిని బయటపెట్టాడు. పెద్ద షాకిచ్చాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 04 2024, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్‌ హీరోల్లో సక్సెస్‌ పరంగా టాప్‌లో ఉన్నారు. `అఖండ`, `వీరిసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు బాబీతో భారీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. తనదైన మాస్‌ డైలాగులు, పంచ్‌లతో రెచ్చిపోతున్నారు. అభిమానులకు ఊపు తెస్తున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే బాలయ్య చిలిపి కృష్ణుడు కూడా ఉన్నాడట. సెట్‌లో ఆయన ఎలా ఉంటారో, ఆయన నిజ స్వరూపం ఏంటో బయటపెట్టాడు నటుడు సమీర్‌. బాలకృష్ణ నటించే చాలా సినిమాల్లో ఆయన భాగమవుతారు. బాలయ్య సినిమా అంటే సమీర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉంటాయి. దీంతో బాలయ్యతో ఆయనకు మంచి ర్యాపో ఉంది. కానీ ఆ ర్యాపోతో బాలయ్య చేసిన పని వెల్లడించాడు సమీర్‌. 
 

37

ఇదిలా ఉంటే.. బాలయ్యపై ఓ బ్యాడ్‌ కామెంట్‌ తరచూ వినిపిస్తుంటుంది. ఆయన కోపం వస్తే కొడతారని, అది సినిమా సెట్ అయినా, పబ్లిక్‌ మీటింగ్‌ అయినా, సందర్బం ఏదైనా తనకు చిరాకు తెప్పిస్తే ఫైర్‌ అవుతాడు, అభిమానులను చాలా మందిని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 

47

ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన బయటపెట్టాడు. ఓ రోజు సినిమా షూటింగ్‌ టైమ్‌లో బాలయ్య రిలాక్స్ అవుతున్నారు. షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చారు. ఈ సమయంలో బాలయ్యలో చిలిపి కృష్ణుడు నిద్ర లేచాడట. సమీర్‌ భార్య ఫోన్‌ నెంబర్‌ అడిగాడట. దీంతో సమీర్‌కి ఒక్కసారిగా టెన్షన్‌ పడ్డాడట. తన భార్య ఫోన్‌ నెంబర్‌ ఎందుకు అడుగుతున్నాడని కలవరానికి గురయ్యాడట.  
 

57

సర్‌ ఎందుకో చెప్పండి, ఫోన్‌ కలిపి ఇస్తానని అన్నాడట. అయినా, వినలేదట బాలయ్య. ఏ మీ వైఫ్‌ నెంబర్‌ ఇవ్వకూడదా? నేను మాట్లాడకూడదా అని అడిగాడట. సమీర్‌కి ఏం తోయడం లేదు. కాస్త టెన్షన్‌ టెన్షన్‌గానే ఇచ్చాడట. దీంతో తనముందే తన భార్యకి ఫోన్‌ చేసి ఆయన మాట్లాడిన మాటలకు షాక్‌ అయ్యాడట. సమీర్‌ భార్యకి ఫోన్‌ చేసిన బాలయ్య.. మీ సమీర్‌ సెట్‌కి రాలేదు, ఆయన కోసం టీమ్‌ అంతా వెయిట్‌ చేస్తున్నాం, ఫోన్‌ ఎత్తడం లేదు, మీకు తెలుసేమో అని, మీ నెంబర్‌ కనుక్కుని ఫోన్‌ చేస్తున్నా అని మాట్లాడాడట బాలయ్య. ఆయన రాకపోతే సినిమా ప్యాకప్‌ చెప్పేస్తామనే రేంజ్‌లో బెదిరించాడట. మొదట ఆమె నమ్మకపోవడంతో తాను హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పాడట. 

67

దీంతో వెంటనే తన భార్య వరుసగా ఫోన్లు చేస్తుందని, తన ఫోన్‌ కూడా బాలయ్య వద్దే పెట్టుకుని కట్‌ చేస్తున్నాడట. తన భార్య వరుసగా మెసేజ్‌లు చేస్తుంది. వాటిని అందరి మందు చదువుతున్నాడట. మొత్తంగా తన భార్య వద్ద తనని బాగా ఇరికించాడట బాలయ్య. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, తాను ఏం చెప్పినా నమ్మదు, బాలకృష్ణనే అసలు విషయం చెప్పాలి. అదే విషయం ఆయనకు చెబితే మధ్యాహ్నం వరకు వెయిట్‌ చేయాలన్నాడట. తీరి చివర్లో మళ్లీ ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడట. అప్పుడు గానీ తన భార్య, తాను కుదుట పడ్డామని తెలిపారు. 
 

77
Balakrishna

Balakrishna

బాలయ్య సెట్‌లో ఇలా చిలిపిగా వ్యవహరిస్తారని, చాలా జోవియల్‌గా ఉంటాడని తెలిపారు. అదే సమయంలో ఆయన చిలిపి పనులు చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయని కూడా తెలిపారు సమీర్‌. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved